అక్షరటుడే, వెబ్డెస్క్:CM Revanth Reddy | తెలంగాణ ఆవిర్భావ వేడుకలను సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్(Secunderabad Parade Ground)లో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం రేవంత్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన తొమ్మిది మందికి రూ.కోటి చొప్పున నగదు పురస్కారం అందజేశారు.
తెలంగాణ (Telangana) ఉద్యమం కోసం ఎంతోమంది కవులు, కళాకారులు పని చేశారు. తమ కవితలు, పాటలతో ఉద్యమానికి ఊపు తెచ్చారు. తెలంగాణ సాధనలో నాడు కవులు, కళాకారుల పాత్ర మరువలేనిది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన తొమ్మిది మందికి రూ.కోటి చొప్పున నగదు సాయం చెక్కును అందజేశారు.
CM Revanth Reddy | పురస్కారం అందుకున్నది వీరే..
తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పని చేసిన తొమ్మిది మందికి సీఎం రాష్ట్ర ఆవిర్భావ(Telangana Formation Day) వేడుకల్లో చెక్కులు అందజేశారు. నగదు పురస్కారాలు అందుకున్న వారిలో ఎక్కా యాదగిరి రావు, అందెశ్రీ, సుద్దాల అశోక్ తేజ, జయరాజు, పాశం యాదగిరి ఉన్నారు. దివంగత గూడ అంజయ్య, గద్దర్, బండి యాదగిరి తరఫున వారి కుటుంబ సభ్యులు నగదు పురస్కారాన్ని అందుకున్నారు. విదేశీ పర్యటనలో ఉన్న గోరెటి వెంకన్న తరఫున ఆమె కూతురు చెక్కు తీసుకున్నారు. వీరికి నగదు పురస్కారంతో పాటు ఇంటి స్థలం ఇస్తామని సీఎం ప్రకటించారు.