Homeజిల్లాలునిజామాబాద్​Best Teacher Award | ఉత్తమ గురువు గోపిశెట్టి రాంబాబుకు సీఎం చేతుల మీదుగా సత్కారం

Best Teacher Award | ఉత్తమ గురువు గోపిశెట్టి రాంబాబుకు సీఎం చేతుల మీదుగా సత్కారం

- Advertisement -

అక్షరటుడే, డిచ్‌పల్లి: Best Teacher Award | రాష్ట్రవ్యాప్తంగా ఉత్తమ ఉపాధ్యాయులకు సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) హైదరాబాద్​లో ఘనంగా సన్మానించారు. జిల్లాలోని తెయూ (Telanagana University) కామర్స్‌ ప్రొఫెసర్‌ గోపిశెట్టి రాంబాబుకు (Gopishetty Rambabu) రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు లభించింది.

ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్‌లోని శిల్పారామంలో నిర్వహించిన గురుపూజోత్సవంలో ఉన్నత విద్యామండలి ప్రిన్సిపల్‌ సెక్రెటరీ డాక్టర్‌ యోగితారాణా, అధ్యక్షుడు ప్రొఫెసర్‌ బాలకృష్ణారెడ్డి చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయనను శాలువా, మెమోంటో పూలమాలతో ఘనంగా సత్కరించారు. ప్రోత్సాహకంగా రూ.10వేల నగదు పారితోషికం అందజేశారు.

ఆచార్య రాంబాబు గోపిశెట్టికి 28 ఏళ్ల బోధన, పరిశోధనా అనుభవం ఉంది. డీన్‌–హెడ్, ఫ్యాకల్టీ ఆఫ్‌ కామర్స్‌ అకాడమిక్‌తోపాటు ఎగ్జామినేషన్‌ విభాగంలో అడిషనల్‌ కంట్రోలర్‌గా, యూనివర్సిటీ హాస్టల్స్‌ ప్రిన్సిపాల్‌గా పనిచేశారు. జాతీయ, అంతర్జాతీయ సెమినార్లు, వర్క్‌షాపులు నిర్వహించారు. ఆయన పర్యవేక్షణలో 13 మంది పీహెచ్‌డీలు పూర్తి చేసుకున్నారు. మరో 8 మంది పరిశోధనలు ఆయన పర్యవేక్షణలో కొనసాగిస్తున్నారు.

యూజీ, పీజీ విద్యార్థుల కోసం ఉద్దేశించిన అకౌంటింగ్, ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్, బ్యాంకింగ్‌ లా అండ్‌ ప్రాక్టీస్, క్వాంటిటేటివ్‌ టెక్నిక్స్, టాక్సేషన్‌పై 15 పుస్తకాలు రచించారు. పరిశోధన ప్రచురణలో ప్రసిద్ధ జాతీయ, అంతర్జాతీయ జర్నల్స్‌లో సుమారు 85 పరిశోధనా వ్యాసాలు రాశారు. 31 జాతీయ, అంతర్జాతీయ సెమినార్లలో పాల్గొన్నారు. వివిధ ప్రోగ్రామ్‌ల్లో ఎంటర్​ప్రెన్యూర్​షిప్‌ డెవలప్‌మెంట్‌ మార్కెటింగ్‌ మేనేజ్‌మెంట్, అకౌంటింగ్‌పై విస్తృత ఉపన్యాసం చేశారు. ఉత్తమ అవార్డు రావడంపై వర్సిటీ వీసీ యాదగిరి రావు, రిజిస్టార్‌ యాదగిరి, తోటి అధ్యాపకులు ఆయనకు అభినందనలు తెలిపారు.