అక్షరటుడే, కోటగిరి : CM CUP | గ్రామస్థాయిలో సీఎం కప్ పోటీలను ఈనెల 28వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు ఎంఈవో శంకర్ తెలిపారు. పోతంగల్ మండల (Pothangal Mandal) కేంద్రంలో మండల ప్రజా పరిషత్ ఆధ్వర్యంలో శనివారం సీఎం కప్ జ్యోతి ప్రజ్వలన చేసి ర్యాలీని ప్రారంభించారు. ఈ ర్యాలీ మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయం (Panchayat Office) దగ్గర నుంచి బస్టాండ్ వరకు విద్యార్థులతో కలిసి సాగింది.
CM CUP | గతేడాది నుంచి..
ఈ సందర్భంగా ఎంఈవో శంకర్ (MEO Shankar) మాట్లాడుతూ.. సీఎం కప్ గతేడాది నుంచి వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జనవరి 22 నుంచి 28వరకు గ్రామస్థాయిలో, 28 నుంచి 31 వరకు మండల స్థాయిలలో కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, రన్నింగ్, జంపింగ్, యోగా తదితర క్రీడా పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. పోతంగల్ మండలంలో ఉత్తమ క్రీడాకారులు ఉన్నారని.. వారంతా తమ ప్రతిభతో రాష్ట్రస్థాయిలో ప్రతిభ చూపాలని ఆకాంక్షించారు. నూతన సర్పంచులు, స్థానిక నాయకులు గ్రామ పంచాయతీ కార్యదర్శుల సహకారంతో గ్రామాల్లో క్రీడల అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ కల్లూరి సంధ్య హన్మాండ్లు, ఎంపీడీవో చందర్, సర్పంచులు, ఉప సర్పంచ్లు, ప్రజా ప్రతినిధులు, కార్యదర్శులు, నాయకులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.