ePaper
More
    HomeతెలంగాణCM Revanth | రాష్ట్రంలో యూరియా కష్టాలు.. కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లిన సీఎం

    CM Revanth | రాష్ట్రంలో యూరియా కష్టాలు.. కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లిన సీఎం

    Published on

    అక్షరటుడే, హైదరాబాద్: CM Revanth : రాష్ట్రంలో యూరియా కష్టాలు ఎదురవకుండా సీఎం రేవంత్​ రెడ్డి చర్యలు చేపట్టారు. ఈ మేరకు కేంద్ర ఎరువులు, ర‌సాయ‌నాల శాఖ మంత్రి జేపీ నడ్డా (Union Fertilizers and Chemicals Minister JP Nadda)ను కలిశారు. తెలంగాణ(Telangana)కు కేటాయించిన‌ యూరియాను వెంటనే స‌ర‌ఫ‌రా చేయాల‌ని కోరారు. ఢిల్లీ(Delhi) పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రిని సీఎం ఆయన నివాసంలో కలిశారు. సీఎం వెంట రాష్ట్ర ప్ర‌భుత్వ స‌ల‌హాదారు ఏపీ జితేందర్ రెడ్డి(State Government Advisor AP Jitender Reddy), ఎంపీలు డాక్ట‌ర్ మల్లు రవి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఉన్నతాధికారులు ఉన్నారు.

    CM Revanth : ఇంకా రావాల్సింది ఎంతంటే..

    వానా కాలం సీజ‌న్‌కు సంబంధించి రాష్ట్రానికి 5 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నులు పంపించాలి. కానీ, కేవలం 3.07 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నులు మాత్ర‌మే స‌ర‌ఫ‌రా అయింది. ఇదే విషయాన్ని కేంద్ర మంత్రి దృష్టికి సీఎం తీసుకెళ్లారు. రాష్ట్రంలో ప్రాజెక్టుల‌కు నీరు చేరుతోంది. వ్యవసాయ ప‌నులు కూడా జోరుగా సాగుతున్నాయి. ఈ స‌మ‌యంలో యూరియా స‌ర‌ఫ‌రా లేక రైతులు ఇబ్బందులు ప‌డుతున్నారు.

    CM Revanth : ఒక్క జులై నెల కోటానే..

    జులై నెలకు సంబంధించి దేశీయంగా ఉత్ప‌త్తయిన యూరియా 63 వేల మెట్రిక్ ట‌న్నులు సరఫరా చేయాల్సి ఉంది.. దీనితోడు విదేశాల నుంచి దిగుమ‌తి చేసుకున్న యూరియా 97 వేల మెట్రిక్ ట‌న్నులు కేటాయించాలి.. కానీ ఇప్ప‌టివ‌ర‌కు కేవ‌లం 29 వేల మెట్రిక్ ట‌న్నులు మాత్రమే ఇచ్చారు.

    More like this

    Revanth meet Nirmala | కళాశాలల్లో అత్యాధునిక ల్యాబ్​ల ఏర్పాటుకు రూ. 9 వేల కోట్లు..!

    అక్షరటుడే, హైదరాబాద్: Revanth meet Nirmala : తెలంగాణ విద్యా రంగంలో స‌మూల‌ మార్పులు తేవ‌డానికి తాము చేస్తున్న‌...

    Nara Lokesh | కేటీఆర్​ను కలిస్తే తప్పేంటి.. ఏపీ మంత్రి లోకేష్​ కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nara Lokesh | మాజీ మంత్రి, బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్ (KTR)​ను కలిస్తే...

    Kamareddy | తల్లికి తలకొరివి పెట్టేందుకు కొడుకు వస్తే వెళ్లగొట్టిన గ్రామస్థులు.. ఎందుకో తెలుసా..?

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | తల్లిని కంటికి రెప్పలా కాపాడుకొని ఆసరాగా ఉండాల్సిన కొడుకు ఇరవై ఏళ్ల క్రితం...