HomeతెలంగాణCM Revanth | మెట్రో రెండో దశకు అనుమతి ఇవ్వాలని కేంద్రమంత్రిని కోరిన సీఎం

CM Revanth | మెట్రో రెండో దశకు అనుమతి ఇవ్వాలని కేంద్రమంత్రిని కోరిన సీఎం

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: CM Revanth | హైద‌రాబాద్ మెట్రో ఫేజ్‌-II (Hyderabad Metro Phase-2) కు స‌త్వ‌ర‌మే అనుమ‌తులు మంజూరు చేయాల‌ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కేంద్ర ప‌ట్ట‌ణ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్​ను కోరారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న హైద‌రాబాద్ న‌గ‌రంలో 76.4 కిలోమీట‌ర్ల పొడ‌వైన మెట్రో ఫేజ్‌-II అవ‌స‌రం ఎంతో ఉంద‌ని వివరించారు.

ఢిల్లీలో కేంద్ర మంత్రి నివాసంలో ఆయనను సీఎం రేవంత్​రెడ్డి కలిశారు. రూ. 24,269 కోట్ల విలువైన ఈ ప్రాజెక్టును కేంద్ర ప్ర‌భుత్వంతో క‌లిసి చేప‌ట్టేందుకు సిద్ధంగా ఉన్నామ‌ని తెలిపారు. ప‌ట్ట‌ణ వ్య‌వ‌హారాల శాఖ సూచ‌న మేర‌కు అవ‌స‌ర‌మైన స‌వ‌ర‌ణ‌లు చేసి ప్రాజెక్టు డీపీఆర్ (DPR) స‌మ‌ర్పించిన విష‌యాన్ని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గుర్తు చేశారు. హైదరాబాద్ మెట్రో ఫేజ్‌-II ఆవ‌శ్య‌క‌త‌ను దృష్టిలో ఉంచుకొని ఇత‌ర శాఖ‌ల నుంచి అవ‌స‌ర‌మైన అనుమ‌తులు ఇప్పించాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు.