ePaper
More
    HomeUncategorizedKamareddy | ముఖం చాటేసిన మేఘం..

    Kamareddy | ముఖం చాటేసిన మేఘం..

    Published on

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | రైతన్నకు కష్టాలు తప్పడం లేదు. ఓవైపు గిట్టుబాటు ధర కోసం ప్రభుత్వాలతో పోరాడుతున్న అన్నదాతకు వరుణుడు సైతం సహకరించడం లేదు. సకాలంలో వర్షాలు కూడా కురవకపోవడంతో కర్షకులు కన్నీళ్లు పెడుతున్నారు. మిరుగు నుంచి చుక్క చినుకు రాక రైతన్నలు ఆకాశం వైపు చూస్తూ వరుణ దేవుడా కరుణించు అని వేడుకుంటున్నారు.

    Kamareddy | కామారెడ్డి జిల్లాలో..

    కామారెడ్డి జిల్లాలో ధాన్యం కొనుగోలు పూర్తయిన తర్వాత ఖరీఫ్ (Kharif season) పంట సాగుపై రైతులు బిజీగా ఉన్నారు. వర్షాకాలం కంటే ముందు జోరుగా కురిసిన వర్షాలకు ఈ యేడు నీటి కొరత (Water problems) లేదని, వర్షాలు సమృద్ధిగా పడతాయని ఆశతో దుక్కులు దున్ని అన్ని సిద్ధం చేసుకున్నారు. పంట సాగు చేసుకోవడానికి విత్తనాలు విత్తుకున్నారు. పలు చోట్ల వరినారు సైతం వేశారు. తీరా వర్షాలు పడే సమయానికి వరుణుడు ముఖం చాటేశాడు. మిరుగు తర్వాత కురావాల్సిన వర్షాలు ఇప్పటికి జాడ లేదు. దీంతో అన్నదాతల్లో ఆందోళన నెలకొంది.

    Kamareddy | వెయ్యికళ్లతో ఎదురుచూపులు..

    రబీలో (Rabi season) అకాల వర్షాల కారణంగా పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో అన్నదాతలు పంట చివరి వరకు కంటికి రెప్పలా కాపాడుకోవాల్సి వచ్చింది. కాగా.. ఈ సీజన్​లో రుతుపవనాలు ముందే వచ్చాయని భావించిన రైతులకు నిరాశే మిగులుతోంది. వర్షం ఎప్పుడు పడుతుందా.. ఎప్పుడు పంట మొలకెత్తుతుందా అని రైతన్నలు ఎదురుచూస్తున్నారు.

    Kamareddy | ట్యాంకర్లతో నీటి సరఫరా

    గత రబీలో సరైన సమయంలో పంటకు నీరందక ఎండిపోయే దశలో కొంతమంది రైతులు ట్యాంకర్ల ద్వారా పంటకు నీరు పారిస్తున్నారు. ప్రస్తుతం కూడా ఇదే పరిస్థితి ఏర్పడిందని వారు వాపోతున్నారు. ఎండిపోతున్న మొక్కజొన్న పంటను కాపాడుకునేందుకు ట్యాంకర్ ద్వారా నీరు తెప్పించి నీటిని పంటలకు అందిస్తున్నారు. అసలే పంట పెట్టుబడికి ఇబ్బందులు పడ్డ తమకు ప్రస్తుతం ట్యాంకర్ ఖర్చు అదనపు భారంగా మారుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షం పడితే తప్ప పంట గట్టెక్కే పరిస్థితి లేదని చెబుతున్నారు.

    ట్యాంకర్​కు బాగా ఖర్చవుతోంది..

    – ఆముదాల రమేష్, రైతు

    వేల రూపాయలు పెట్టుబడి పెట్టి పంట వేశాను. 15 రోజుల నుంచి చుక్క వర్షం లేదు. మొక్కజొన్న పంట మొత్తం ఎండిపోతుంది. కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని సరంపల్లి నుంచి ట్యాంకర్ ద్వారా నీటిని తెచ్చి పంటకు పారిస్తున్నాను. ట్యాంకర్​కు రోజుకు రూ. 1,000 ఖర్చు అవుతుంది. వర్షం సకాలంలో పడితే అదనపు ఖర్చు భారం ఉండదు.

    మొక్కజొన్న పంటకు నీళ్లు పట్టేందుకు తీసుకొచ్చిన ట్యాంకర్​

    More like this

    Hydraa | 600 గ‌జాల స్థ‌లాన్ని కాపాడిన హైడ్రా

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hydraa | హైదరాబాద్​ (Hyderabad) నగరంలో ప్రభుత్వ, ప్రజా ఆస్తులను హైడ్రా అధికారులు కాపాడున్నారు....

    Revanth meet Nirmala | కళాశాలల్లో అత్యాధునిక ల్యాబ్​ల ఏర్పాటుకు రూ. 9 వేల కోట్లు..!

    అక్షరటుడే, హైదరాబాద్: Revanth meet Nirmala : తెలంగాణ విద్యా రంగంలో స‌మూల‌ మార్పులు తేవ‌డానికి తాము చేస్తున్న‌...

    Nara Lokesh | కేటీఆర్​ను కలిస్తే తప్పేంటి.. ఏపీ మంత్రి లోకేష్​ కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nara Lokesh | మాజీ మంత్రి, బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్ (KTR)​ను కలిస్తే...