- Advertisement -
Homeతెలంగాణclouds | భానుడి తరంగం.. పసిడి వర్ణంలో మెరిసిన మేఘం

clouds | భానుడి తరంగం.. పసిడి వర్ణంలో మెరిసిన మేఘం

- Advertisement -

అక్షరటుడే, హైదరాబాద్: clouds : తెలంగాణపై భూమధ్యరేఖ శీతోష్ణస్థితి కొనసాగుతోంది. మధ్యాహ్నం గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఆరెంజ్​, రెడ్​ జోన్​ స్థాయిలో నమోదు అవుతున్నాయి. సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారుతోంది. ఆకాశాన్ని క్యూములోనింబస్​ మేఘాలు కమ్మేస్తున్నాయి. ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన భారీ వర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. హైదరాబాద్​లో మంగళవారం సాయంత్రం మేఘాలు కమ్ముకుంటున్న వేళ.. అంతెత్తున ఓ మేఘంపై భానుడి కిరణాలు పడటంతో.. ఆ మేఘం పసిడి వర్ణంలో ప్రతిబింబిస్తూ మహా నగర వాసులను కనువిందు చేసింది. ఉన్నతశ్రేణి హిమాలయాల్లోని వైకుంఠ క్షేత్రంగా భావించే కైలాస పర్వతంలా దర్శనం ఇచ్చింది. ఈ అద్భుత దృశ్యకావ్యాన్ని తిలకించిన మహానగర వాసులు కాసేపు మైమరచిపోయారు. నిత్యం యాంత్రికంగా మారిన జీవితం నుంచి కాస్త ఉపశమనం పొందారు.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News