అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Cloud Burst | ఉత్తరాఖండ్(Uttarakhand)లో కుండపోత వర్షం బీభత్సం సృష్టించింది. క్లౌడ్ బరస్ట్(Cloud Burst) అవడంతో ఒక్కసారిగా భారీ వర్షం పడింది. ఒక్కసారిగా వర్షం పడటంతో కొండచరియలు విరిగిపడ్డాయి. వరదల ధాటికి ఒక గ్రామం మొత్తం కొట్టుకుపోయింది.
ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ(Uttarkashi)లోని హర్సిల్ సమీపంలోని ధరాలి గ్రామంలో మంగళవారం క్లౌడ్ బరస్ట్ అయింది. దీంతో ధరాలి గ్రామం (Dharali Village)పై కొండ చరియలు విరిగిపడటంతో కొట్టుకుపోయింది. ఉత్తరకాశీ జిల్లాలో భారీ వరదలు తలెత్తాయి. ఖీర్ గంగా నది ఉధృతంగా పారుతోంది. ధరాలి గ్రామాన్ని వరదలు ముంచెత్తాయి. దీంతో పలు ఇళ్లు కూలిపోయాయి. వందలాది మంది గల్లంతు అయ్యారు. ఇళ్ల శిథిలాల కింద పలువురు చిక్కుకున్నారు. అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు.
హర్సిల్ ప్రాంతంలోని ఖీర్ గఢ్ నీటి మట్టం పెరగడంతో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్, సైన్యం, ఇతర అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. అయితే ప్రమాదంలో ఎంత మేర ఆస్తి, ప్రాణ నష్టం జరిగిందనే వివరాలు తెలియాల్సి ఉంది.
వర్షాకాలం ప్రారంభమైన నాటి నుంచి ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తున్నాయి. కుండపోత వానలతో పలు ప్రాంతాల్లో వరద పోటెత్తి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నదులు, వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. హల్ద్వానీ సమీపంలోని భఖ్రా వాగులో సోమవారం ఒకరు కొట్టుకుపోయారు. భుజియఘాట్ సమీపంలో ఉప్పొంగిన వాగులో ఆదివారం ఇద్దరు మునిగిపోయారు.
Cloud Burst | ఉత్తర ప్రదేశ్‌లో సైతం..
ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు ఆగం చేస్తున్నాయి. ఉత్తర ప్రదేశ్‌లో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గంగా, యమున నదులు ఉప్పొంగి ప్రవహించాయి. ప్రయాగ్‌రాజ్ నగరాన్ని వరద ముంచెత్తడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారు.
View this post on Instagram