అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Cloud Burst | భారీ వర్షాలతో పలు రాష్ట్రాలు అతలాకుతలమవుతున్నాయి. ప్రధానంగా ఉత్తరాది రాష్ట్రాలు వణికిపోతున్నాయి. మేఘ విస్ఫోటనలు జరిగి వరదలు పోటెత్తున్నాయి. తాజాగా శుక్రవారం ఉత్తరాఖండ్(Uttarakhand)లో క్లౌడ్ బరస్ట్‌తో భారీ వర్షాలు(Cloud Burst) కురిశాయి.
చమోలి, రుద్రప్రయాగ్ జిల్లాలను భారీ వరదలు(Heavy Floods) ముంచెత్తాయి. వరదల కారణంగా భారీ ఆస్తి నష్టం సంభవించింది. వరద ముంచెత్తడంతో ఇళ్లు ధ్వంసమయ్యాయి. పలువురు గల్లంతు కాగా, వేలాది మంది నిరాశ్రయులయ్యారు.
Cloud Burst | ఇద్దరు గల్లంతు..
రాష్ట్రంలో రుతుపవనాల అల్లకల్లోలం కొనసాగుతోందని ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి(CM Pushkar Singh Dhami) శుక్రవారం X లో తెలిపారు. కొన్ని కుటుంబాలు శిథిలాల కింద చిక్కుకున్నాయని, వారిని రక్షించడానికి సహాయక చర్యలు ప్రారంభించామని ధామి తెలిపారు. స్థానిక అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నానని, సహాయక చర్యలను సమర్థవంతంగా నిర్వహించేలా విపత్తు బృందాలకు ఆదేశాలు జారీ చేసినట్లు ధామి చెప్పారు. బాధితులు క్షేమంగా బయటకు రావాలని బాబా కేదార్‌ను ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు.చమోలి జిల్లా(Chamoli District)లో భారీ వరదలతో ఇద్దరు గల్లంతయ్యారు. దేవాల్‌లో ఇద్దరు గల్లంతయ్యారని, వేలాది జంతువులు జల సమాధి అయ్యాయని చమోలి జిల్లా మేజిస్ట్రేట్ సందీప్ తివారీ తెలిపారు. భారీ వర్షాల కారణంగా రోడ్లు తీవ్రంగా దెబ్బ తిన్నాయని, ఇది సహాయ చర్యలకు ఆటంకంగా మారిందన్నారు.