ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​SriramSagar Project | శ్రీరాంసాగర్ వరదగేట్ల మూసివేత

    SriramSagar Project | శ్రీరాంసాగర్ వరదగేట్ల మూసివేత

    Published on

    అక్షరటుడే, బాల్కొండ: SriramSagar Project | తెలంగాణ వరప్రదాయని శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి వరద తగ్గుముఖం పట్టడంతో గేట్లను ముసివేశారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 50 వేల నుంచి 90 క్యూసెక్కుల ఇన్​ఫ్లో వచ్చి చేరుతోంది.

    ఆగస్టు మొదటి వారం నుంచి ప్రాజెక్టులోకి క్రమంగా వరద పెరుగుతూ వచ్చింది. దీంతో అధికారులు ప్రాజెక్టు నీటిమట్టాన్ని పరిశీలిస్తూ.. గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టుకు 42 గేట్లు ఉండగా.. 39 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ఆగస్టు చివరివారంలో ఎగువ నుంచి భారీగా ఇన్​ఫ్లో రావడంతో ఏకంగా 5,50,000 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదిలారు.

    ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు (80.5 టీఎంసీలు) కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 1089.9 అడుగుల (76.053 టీఎంసీలు) మేర నీరు నిల్వ ఉంది. ఈ మేరకు శుక్రవారం ఉదయం 9 వరదగేట్లను ఎత్తి దిగువకు నీటిని వదిలిన అధికారులు మధ్యాహ్నం వరదగేట్లను ముసివేశారు.

    SriramSagar Project | కాల్వల ద్వారా నీటివిడుదల

    ఎస్కేప్​ గేట్ల (Escape gates) ద్వారా 3,500 క్యూసెక్కులు, కాకతీయ కాలువ (kakatiya Canal) ద్వారా 4,500 క్యూసెక్కులు, వరద కాలువ ద్వారా 18వేల క్యూసెక్కులు, మిషన్ భగీరథకు (Mission Bhagiratha) 231 క్యూసెక్కులు వదులుతున్నారు. 666 క్యూసెక్కుల నీరు ఆవిరిగా పోతోంది. మొత్తం 26,897 క్యూసెక్కుల నీటిని కాలువ ద్వారా వదులుతున్నారు. వరద నీటి ఉధృతి ఇంకా కొనసాగుతున్నందున గోదావరి (Godavari) పరీవాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రాజెక్టు ఏఈఈ కొత్త రవి పేర్కొన్నారు.

    More like this

    CM Revanth Reddy | పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్​రెడ్డి భేటీ

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : CM Revanth Reddy | ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి బీఆర్​ఎస్​ (BRS) నుంచి కాంగ్రెస్​లో చేరిన...

    Shabbir Ali | షబ్బీర్ అలీ కారుకు ప్రమాదం

    అక్షరటుడే, కామారెడ్డి: Shabbir Ali | కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో (Government Degree College) బీసీ...

    Nizamabad City | పౌర్ణమిని సందర్భంగా నగరంలో శ్రీప్రభు పల్లకీ సేవ

    అక్షరటుడే,ఇందూరు: Nizamabad City | నగరంలోని వినాయక్​నగర్​లోని వినాయక కళ్యాణ మండపంలో (Vinayaka Kalyana Mandapam) ఓమౌజయ ఏకోపాసన...