ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Sriram Sagar | శ్రీరాంసాగర్ వరద గేట్ల మూసివేత

    Sriram Sagar | శ్రీరాంసాగర్ వరద గేట్ల మూసివేత

    Published on

    అక్షరటుడే, బాల్కొండ: Sriram Sagar | తెలంగాణ వరప్రదాయని శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి (Sriram Sagar Project) వరద తగ్గుముఖం పట్టడంతో వరద గేట్లను ముసివేశారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 29,545 క్యూసెక్కుల ఇన్​ఫ్లో వచ్చి చేరుతోంది. బుధవారం రాత్రి 8 వరద గేట్లను ఎత్తి దిగువకు నీటిని వదిలిన అధికారులు గురువారం ఉదయం వరద గేట్లను ముసివేశారు.

    Sriram Sagar | కాల్వల ద్వారా నీటి విడుదల

    ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరుతుండడంతో కాకతీయ కాలువ (Kakatiya Canal) ద్వారా 5,500 క్యూసెక్కులు, వరద కాలువ ద్వారా 19,000 క్యూసెక్కులు, సరస్వతి కాలువ ద్వారా 800 క్యూసెక్యులు, లక్ష్మి కాలువ ద్వారా 200 క్యూసెక్యులు విడుదల చేస్తున్నారు. అలీసాగర్ ఎత్తిపోతలకు 360 క్యూసెక్కులు, గుత్ప ఎత్తిపోతలకు 270 క్యూసెక్యులు, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కులు వదులుతున్నారు. 684 క్యూసెక్కుల నీరు ఆవిరిగా పోతోంది. మొత్తం 29,545 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు (80.501 టీఎంసీలు) కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 1091 అడుగుల (80.501టీఎంసీలు) మేర నీరు నిల్వ ఉంది. వరద నీటి ప్రవాహం ఉధృతి ఉన్నందున గోదావరి పరిసర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రాజెక్ట్​ ఏఈఈ కొత్త రవి (AE Kotha Ravi) తెలిపారు.

    More like this

    Rahul Gandhi | సెక్యూరిటీ ప్రొటోకాల్ ఉల్లంఘించిన రాహుల్.. కాంగ్రెస్ నేతపై మండిపడ్డ బీజేపీ

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rahul Gandhi | కాంగ్రెస్ ఎంపీ, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తన...

    Turmeric Milk | రోజూ పసుపు పాలు తాగితే ఇన్ని లాభాలా..

    అక్షరటుడే, హైదరాబాద్ : Turmeric Milk | భారతీయ సంప్రదాయంలో పసుపు పాలకు (గోల్డెన్ మిల్క్) ఒక ప్రత్యేక...

    Bajireddy Govardhan | జర్నలిస్ట్ నారాయణ మృతదేహానికి బాజిరెడ్డి నివాళి

    అక్షరటుడే, డిచ్​పల్లి: Bajireddy Govardhan | మండలంలోని ఆంధ్రజ్యోతి సీనియర్ రిపోర్టర్ లక్కవత్రి నారాయణ (Lakkavatri Narayana) గుండెపోటుతో...