అక్షరటుడే, వెబ్‌డెస్క్ : IBPS Clerk Notification | బ్యాంకింగ్ రంగం(Banking sector)లో ఉద్యోగావకాశాల కోసం ఎదురు చూస్తున్నవారికి ఐబీపీఎస్(ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్) శుభవార్త తెలిపింది. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో క్లర్క్ (కస్టమర్ సర్వీస్ అసోసియేట్) పోస్టులను భర్తీ చేసేందుకు భారీ నోటిఫికేషన్(Notification) జారీ చేసింది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(UBI), బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, ఐవోబీ(IOB), పీఎన్‌బీ, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, యూకో బ్యాంక్‌లలో పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ ఇచ్చారు. డిగ్రీ పూర్తి చేసిన 28 ఏళ్లలోపు వారు ఈ పోస్టులకు అర్హులు. నోటిఫికేషన్ వివరాలిలా ఉన్నాయి.
పోస్ట్ పేరు : కస్టమర్ సర్వీస్ అసిస్టెంట్లు/క్లర్క్(Clerk)
భర్తీ చేసే పోస్టుల సంఖ్య : 10,277. ఇందులో ఆంధ్రప్రదేశ్‌లో 367, తెలంగాణ(Telangana)లో 261 పోస్టులు భర్తీ కానున్నాయి.
విద్యార్హత : బ్యాచిలర్ డిగ్రీ.
వయో పరిమితి : 20 నుంచి 28 ఏళ్లలోపువారు.
దరఖాస్తు గడువు : ఈనెల 21 వరకు..
దరఖాస్తు రుసుము : జనరల్(General), ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ. 850 ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీవోడబ్ల్యూ అభ్యర్థులకు ఫీజు రూ. 175.
పరీక్ష విధానం : ఆన్‌లైన్ ద్వారా..
పరీక్ష తేదీలు : ప్రిలిమ్స్(Prelims) పరీక్షను అక్టోబర్ 4, 5, 11 తేదీలలో నిర్వహిస్తారు.
మెయిన్స్ పరీక్ష నవంబర్ 29న ఉంటుంది.
పూర్తి వివరాలకోసం ఐబీపీఎస్ అధికారిక వెబ్‌సైట్(www.ibps.in)లో సంప్రదించండి.