అక్షరటుడే, ఇందూరు: Mla Dhanpal | ప్రతి ఒక్కరూ మట్టి గణపతులను (Clay Ganesha) పూజించి పర్యావరణాన్ని కాపాడాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పిలుపునిచ్చారు. నగరంలోని పోచమ్మ గల్లి (Pochamma gally) రవితేజ యూత్ సొసైటీ (Ravi Teja Youth Society) ఆధ్వర్యంలో మట్టి గణపతి విగ్రహ ఏర్పాటుకు బుధవారం భూమిపూజ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణలోనే (Telangana) అతి పెద్ద మట్టి గణపతిని నిర్మిస్తూ రవితేజ యూత్ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు. జాతీయ స్ఫూర్తిని పెంపొందించే ఉద్దేశంతో మొదలైన గణేష్ నవరాత్రులు హిందూ ధర్మానికి నిదర్శనమన్నారు.
పండుగను ప్రతి ఒక్కరూ నియమ నిష్టలతో జరుపుకోవాలని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మండపాల కమిటీ సభ్యులు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ (Jilla Parishath) మాజీ ఛైర్మన్ దాదన్న గారి విఠల్, రవితేజ యూత్ సొసైటీ అధ్యక్షుడు నీలగిరి రాజు, కన్వీనర్ కిరణ్, బీజేపీ నాయకులు లక్ష్మీ నారాయణ, బీఆర్ఎస్ నాయకుడు సిర్పరాజు, ఆనంద్, పల్నాటి కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.