అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy | వినాయక చవితి సందర్భంగా మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించాలని ఎల్లారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ లక్ష్మీనారాయణ (Dr.E. Lakshminarayana) అన్నారు. కళాశాలలో వృక్ష శాస్త్రం, ఐక్యూఏసీ, ఎన్ఎస్ఎస్ విభాగాల ఆధ్వర్యంలో సోమవారం మట్టి గణపతుల తయారీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.. మట్టి గణపతి విగ్రహాలను (clay Ganesha idols) పూజించడం వల్ల వాతావరణ కాలుష్యం ఉండదన్నారు. శబ్ద కాలుష్యం లేకుండా, మత్తు పదార్థాల జోలికి పోకుండా ప్రశాంతంగా పండుగ జరుపుకోవాలన్నారు. అనంతరం మట్టి గణపతులు తయారు చేసిన విద్యార్థులను అభినందించారు.
మట్టి గణపతులు తయారు చేసిన విద్యార్థుల్లో ప్రథమ, ద్వితీయ, ప్రోత్సాహక బహుమతులకు ఎంపిక చేశారు. కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ చంద్రకాంత్, ఐక్యూఏసీ కో–ఆర్డినేటర్ డాక్టర్ వి.శంకరయ్య, టీఎస్ కేసీ ఇన్ఛార్జి శివకుమార్, సైన్స్ ఇన్ఛార్జి, డాక్టర్ అరుణ్ కుమార్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి, ఎకో క్లబ్ కో–ఆర్డినేటర్ ఎస్ చంద్రకాంత్, బోటనీ విభాగం అధ్యక్షురాలు డాక్టర్ ఎస్.గోదావరి, ఎన్ఎస్ఎస్ మహిళా విభాగం ప్రోగ్రాం అధికారిణి రాణి, కళాశాల సూపరిండెంట్ వసంతలక్ష్మి, అధ్యాపకులు డాక్టర్ సిద్దురాజ్, డాక్టర్ గంగారెడ్డి, కృష్ణ ప్రసాద్, సంతోష్, మహమూద్, మొయిన్, స్వప్న, సురేశ్ రెడ్డి, కిరణ్ కుమార్, దశరథ్ తదితరులు పాల్గొన్నారు.