Homeజిల్లాలుకామారెడ్డిSri Chaitanya Techno School | సీజ్​ చేసిన స్కూల్​లో తరగతులు

Sri Chaitanya Techno School | సీజ్​ చేసిన స్కూల్​లో తరగతులు

- Advertisement -

అక్షరటుడే, బాన్సువాడ: Sri Chaitanya Techno School | పట్టణంలోని వీక్లీ మార్కెట్​లో శ్రీ చైతన్య టెక్నో స్కూల్​కు (Sri Chaitanya Techno School) అనుమతుల్లేవని శనివారం ఎంఈవో నాగేశ్వరరావు (MEO Nageswara Rao) సీజ్​ చేశారు. ఎట్టిపరిస్థితుల్లో తరగతులు నిర్వహించవద్దని సిబ్బందికి హెచ్చరించారు. అయినప్పటికీ అధికారుల ఆదేశాలు బేఖాతరు చేస్తూ స్కూల్​లో సోమవారం తరగతులు నిర్వహించారు.

Sri Chaitanya Techno School | డీఈవో ఆదేశాలు బేఖాతరు..?

అనుమతులు లేని పాఠశాలల్లో తరగతులు నిర్వహించవద్దని డీఈవో రాజు(DEO Raju) ఆదేశాలు జారీ చేసినప్పటికీ ప్రైవేట్ యాజమాన్యాలు పట్టించుకోకపోవడం కొసమెరుపు. అలాగే తల్లిదండ్రులు సైతం తమ పిల్లలను అనుమతి ఉన్న పాఠశాలల్లోనే చేర్పించాలని సూచిస్తున్నప్పటికీ అవగాహనా రాహిత్యంతో వారు బోగస్​ స్కూళ్లలో చేర్పిస్తున్నారు.

Must Read
Related News