HomeతెలంగాణMedha School | పగలంతా తరగతులు.. రాత్రి మత్తు మందు తయారీ

Medha School | పగలంతా తరగతులు.. రాత్రి మత్తు మందు తయారీ

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Medha School | హైదరాబాద్​ (Hyderabad)లోని బోయిన్​పల్లి మేధా పాఠశాలలో మత్తు మందు తయారు చేస్తుండగా ఈగల్​ టీమ్​ (Eagle Team) పోలీసులు పట్టుకున్న విషయం తెలిసిందే.

పాఠశాలలో మత్తు మందు తయారు చేస్తున్న కేసులో కరస్పాండెంట్​ జయప్రకాశ్​ గౌడ్​ను పోలీసులు అరెస్ట్​ చేశారు. ఆయన రిమాండ్​ రిపోర్టులో కీలక విషయాలు వెల్లడించారు. రెండంతస్తుల బిల్డింగ్​లో ఓ వైపు తరగతులు నిర్వహిస్తూనే మరోవైపు మత్తు మందు తయారీ కోసం రియాక్టర్లు ఏర్పాటు చేశాడు.

Medha School | డబ్బు సంపాదనే లక్ష్యంగా..

జయప్రకాశ్​ గౌడ్​ తక్కువ కాలంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే లక్ష్యంతో మత్తు మందు తయారీ ప్రారంభించారు. రోజంతా పాఠశాలలో తరగతులు నిర్వహించేవాడు. రాత్రి కాగానే మత్తు మందు తయారు చేసేవాడు. మత్తు మందు ఎలా తయారు చేయాలనే ఫార్ములాను గురువారెడ్డి అనే వ్యక్తి నుంచి జయప్రకాశ్​గౌడ్​ కొనుగోలు చేశాడు. మొదట తయారు చేసే క్రమంలో విఫలం అయ్యాడు. అనంతరం విజయవంతం కావడంతో రోజుకు కిలో చొప్పున మత్తు మందు తయారు చేసి విక్రయించడం ప్రారంభించాడు.

Medha School | స్కూటీపై తీసుకెళ్లి విక్రయం

జయప్రకాశ్​ గౌడ్​ తాను తయారు చేసిన మత్తు మందును స్కూటీపై తీసుకెళ్లి హైదరాబాద్​, మహబూబ్​నగర్​​ (Mahabubnagar) లోని కల్లు కంపౌండ్​లకు విక్రయించేవాడు. కాగా ఈ కేసులో ఫార్ములా విక్రయించిన గురువారెడ్డి పరారీలో ఉన్నాడు. ఆయన కోసం పోలీసులు గాలిస్తున్నారు. మరోవైపు కోర్టు జయప్రకాశ్​గౌడ్​కు 14 రోజుల రిమాండ్​ విధించగా.. చంచల్​గూడ జైలుకు తరలించారు.

Must Read
Related News