అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Sarpanch Elections | రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల తొలి దశ పోలింగ్ ప్రక్రియ సాగుతోంది. రెండు, మూడో దశ ఎన్నికల ప్రచారం జోరుగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో పలు గ్రామాల్లో ఘర్షణలు చోటు చేసుకున్నాయి.
జగిత్యాల జిల్లా (Jagtial District) గొల్లపల్లి మండలం ఉల్లిగడ్డ లక్ష్మీపూర్‌లో బుధవారం రాత్రి ఓ అభ్యర్థి దావత్ ఇచ్చాడు. ఈ దావత్లో మద్యం మత్తులో అన్నదమ్ముల మధ్య ఘర్షణ జరిగింది. ఆపడానికి వెళ్లిన తల్లి, తమ్ముడిపై కళ్యాణ్ అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడు. దీంతో లత, శ్రీనివాస్ తీవ్రంగా గాయపడ్డారు. వారిని జగిత్యాలలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
Sarpanch Elections | బీఆర్ఎస్, కాంగ్రెస్ వర్గాల మధ్య
నల్గొండ జిల్లా (Nalgonda District) కొర్లపహాడ్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను నకిరేకల్ ప్రభుత్వ ఆస్పత్రి (Nakirekal Government Hospital)కి తరలించారు. దీంతో గ్రామంలో భారీగా పోలీసులు మోహరించారు.
రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం ఎక్లాస్ ఖాన్పేట్ గ్రామంలో సైతం బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ స్వగ్రామంలో తన మద్దతుదారులను ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి వార్డు సభ్యులుగా నిలబెట్టారు. ఈ క్రమంలో ఎమ్మెల్సీ నవీన్ అనుచరులపై మాజీ ఎమ్మెల్యే అనుచరులు దాడి చేశారు.
Sarpanch Elections | పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత
నల్గొండ జిల్లాలోని ఓ పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, డైరీ కార్పొరేషన్ ఛైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. చిట్యాల మండలం (Chityala Mandal) ఉరుమడ్ల గ్రామంలో ఇద్దరు నేతలు మాటల యుద్ధానికి దిగారు. దీంతో పోలీసులు వారిని సముదాయించారు.
Sarpanch Elections | కాంగ్రెస్ కార్యకర్త ఇంటికి నిప్పు!
ఖమ్మం జిల్లా (Khammam District) కొనిజర్ల మండలం కొండవనమాల గ్రామంలో కాంగ్రెస్ కార్యకర్త సింగాల వెంకటేశ్వర్లు ఇంటికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. కుటుంబ సభ్యులకు తృటిలో ప్రమాదం తప్పింది. అయితే ఇల్లు పూర్తిగా కాలిపోయింది. పంచాయతీ ఎన్నికల సందర్భంగా గ్రామంలో రాజకీయ కక్షల నేపథ్యంలోనే ఇంటికి నిప్పంటించారని స్థానికులు ఆరోపించారు.