Homeఅంతర్జాతీయంPak Vs Afghan | పాక్​–అఫ్గాన్​ మధ్య మళ్లీ ఘర్షణలు..

Pak Vs Afghan | పాక్​–అఫ్గాన్​ మధ్య మళ్లీ ఘర్షణలు..

Pak Vs Afghan | పాకిస్థాన్​–అఫ్గానిస్థాన్​ మధ్య మంగళవారం రాత్రి మళ్లీ ఘర్షణలు చోటు చేసుకున్నాయి. మొదట తాలిబన్లు దాడులు చేపట్టగా తాము తిప్పికొట్టినట్లు పాక్​ చెబుతోంది.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Pak Vs Afghan | పాకిస్థాన్​–అఫ్గానిస్థాన్ (Pakistan–Afghanistan)​ మధ్య మంగళవారం రాత్రి మళ్లీ ఘర్షణలు చోటు చేసుకున్నారు. రెండు దేశాలు దాడులు చేసుకున్నాయి.

ఇరు దేశాల మధ్య ఇటీవల దాడులు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. మొదట పాకిస్థాన్​ తమపై వైమానిక దాడులు చేపట్టినట్లు అఫ్గాన్​ తెలిపింది. దీంతో పాక్​ సైనిక పోస్టులపై తాలిబన్లు దాడులు చేపట్టారు. అనంతరం ఘర్షణలు ఆగిపోగా.. మళ్లీ మంగళవారం రాత్రి ఇరు దేశాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. ముందుగా అఫ్గాన్​ సైన్యం దాడులకు పాల్పడిందని పాక్​ ఆరోపిస్తుంది. తాలిబన్ల దాడులను తాము తిప్పికొట్టినట్లు పాక్​ సైన్యం చెబుతుతోంది.

Pak Vs Afghan | శిక్షణ కేంద్రం ధ్వంసం

అఫ్గాన్‌లో ఖోస్ట్‌ ప్రావిన్స్‌ డిప్యూటీ పోలీసు ప్రతినిధి తాహిర్‌ అహ్రర్‌ ఘర్షణలు చోటు చేసుకున్నట్లు తెలిపారు. మొదట తాలిబన్లు దాడులు చేశారని పాక్​ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. అఫ్గాన్​లో నిషేధిత తెహ్రీక్-ఎ-తాలిబన్ పాకిస్థాన్ (TTP) ఉగ్రవాదులు ఉన్నారని పాక్​ ఆరోపిస్తోంది. అయితే ఈ ఆరోపణలను తాలిబన్లు ఖండిస్తున్నారు. తాజాగా తాలిబన్​ సైన్యం, టీటీపీ ఉగ్రవాదులు కలిపి దాడులు చేశారని పాక్​ ఆరోపించింది. అనంతరం తాము ప్రతిదాడులు చేపట్టామని తెలిపింది. దీంతో అఫ్గాన్​ తాలిబన్ పోస్టులు భారీ నష్టాన్ని చవిచూశాయని, దాడి తర్వాత కనీసం ఒక ట్యాంక్ ధ్వంసమైందని పాక్​ మీడియా పేర్కొంది. టీటీపీకి చెందిన శిక్షణ కేంద్రాన్ని సైతం ధ్వంసం చేసినట్లు పాక్​ అధికారులు తెలిపారు.