అక్షరటుడే, ఇందూరు:Civil Supplies Corporation | కేంద్ర కార్మిక సంఘాల పిలుపుమేరకు ఈనెల 20న జాతీయ సార్వత్రిక సమ్మె నిర్వహిస్తున్నట్లు ఏఐటీయూసీ సివిల్ సప్లయ్స్ కార్పొరేషన్ హమాలీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఓమయ్య(Omayya) తెలిపారు. ఈ మేరకు సివిల్ సప్లయ్స్ కార్పొరేషన్ మేనేజర్ శ్రీకాంత్ రెడ్డి(Srikanth Reddy)కి శనివారం సమ్మె నోటీసులు అందజేశారు. ఈ సందర్భంగా ఓమయ్య మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను రద్దుచేసి 4 కోడ్లను తీసుకువచ్చందని.. వాటిని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. నిజామాబాద్(Nizamabad)లో నిర్వహించే సమ్మెలో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు నర్సింగరావు, కార్యదర్శి హనుమాన్లు, సివిల్ సప్లయ్స్ కార్పోరేషన్ యూనియన్ జిల్లా కార్యదర్శి దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.