HomeUncategorizedCivils Results | సివిల్స్​ ప్రిలిమ్స్​ ఫలితాల విడుదల

Civils Results | సివిల్స్​ ప్రిలిమ్స్​ ఫలితాల విడుదల

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Civils Results | ప్రతిష్ఠాత్మక సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (CSE) ప్రిలిమ్స్‌ 2025 ఫలితాలు విడుదలయ్యాయి. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) బుధవారం ఫలితాలను వెల్లడించింది. మే 25న సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ (Prelims) పరీక్ష జరిగిన విషయం తెలిసిందే. రెండు షిఫ్టుల్లో పరీక్ష నిర్వహించారు. పది లక్షలకు పైగా అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. ఈ పరీక్షలో ప్రతిభ చూపిన 14,161 మంది అభ్యర్థులు మెయిన్స్​కు అర్హత సాధించారు.