ASHA Workers Arrest | సీఐటీయూ, ఆశా కార్యకర్తల ముందస్తు అరెస్ట్​

బాన్సువాడ పట్టణంలో సీఐటీయూ నాయకులను, ఆశకార్యకర్తలను పోలీసులు అరెస్ట్​ చేశారు. అనంతరం పోలీస్​స్టేషన్​కు తరలించారు.

అక్షరటుడే, బాన్సువాడ: ASHA Workers Arrest | పట్టణంలో సీఐటీయూ నాయకులు (CITU Leaders), ఆశా కార్యకర్తలను పోలీసులు అరెస్ట్​ చేశారు. అనంతరం పోలీస్​స్టేషన్​కు తరలించారు. ఆశవర్కర్ల సమస్యలపై సీఐటీయూ ‘ఛలో హైదరాబాద్​’కు పిలుపు ఇచ్చిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు.

ASHA Workers Arrest | హామీలు నెరవేర్చాలని డిమాండ్​..

పట్టణంలోని సంగమేశ్వర్ కాలనీలో (Sangameshwar Colony) సోమవారం ఉదయం సీఐటీయూ నాయకుడు జె.రవీందర్‌ను హౌస్ అరెస్ట్ చేశారు. అదే సమయంలో ఆశా వర్కర్లు వాహనంలో హైదరాబాద్‌కు బయలుదేరుతుండగా బోర్లం గ్రామం వద్ద పోలీసులు అడ్డుకుని, వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం సీఐటీయూ నాయకుడు రవీందర్ మాట్లాడుతూ.. ఎన్నికల ముందు ఆశా వర్కర్లకు (ASHA Workers) నెలకు రూ.18వేలు వేతనం ఇస్తామని హామీఇచ్చిన ప్రభుత్వం, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీని అమలు చేయడం లేదని విమర్శించారు.

ASHA Workers Arrest | మంత్రి, సీఎం స్పందించట్లేదు..

అనేక సందర్భాల్లో ధర్నాలు చేస్తే స్పందించి హామీ ఇచ్చిన మంత్రి సీతక్క (Minister Seethakka) ఇప్పుడు ముఖం చాటేయడం ఎంతవరకు సబబని ఆయన పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సోమవారం జరగబోయే కేబినెట్ సమావేశంలో ఆశ వర్కర్ల సమస్యలపై చర్చించాలని.. అసెంబ్లీ సమావేశాల్లో ఎన్నికల హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యురాలు బి.పల్లవి, కవిత, సుజాత, సుచిత్ర, సుమలత, శ్యామల, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Related articles

Delhi Bomb Threat | ఢిల్లీలో మరోసారి బాంబు బెదిరింపులు

ఢిల్లీలో మరోసారి బాంబు బెదిరింపులు తీవ్ర కలకలం రేపాయి. ఎర్రకోటతో పాటు రెండు పాఠశాలల్లో బాంబు పెట్టినట్లు దుండగులు మెయిల్​ పంపారు.

Trump Tariffs Suspended | రేపటి నుంచి నిలిచిపోనున్న ట్రంప్​ టారిఫ్​లు

పలు దేశాలపై అమెరికా విధించిన ప్రతీకార సుంకాలు రేపటి నుంచి నిలిచిపోనున్నాయి. ఈ మేరకు అధికారులు ప్రకటన విడుదల చేశారు.

Soumya Government Job | ఎక్సైజ్ కానిస్టేబుల్​ గాజుల సౌమ్య సోదరుడికి ప్రభుత్వ ఉద్యోగం

విధినిర్వహణలో గంజాయి ముఠాను పట్టుకునే క్రమంలో ఎక్సైజ్​ కానిస్టేబుల్​ గాజుల సౌమ్య మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రభుత్వం ఆమె​ సోదరుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చింది.

Hyderabad CP Marriage Warning | పెళ్లికి ముందు దగ్గరవ్వొద్దు.. అమ్మాయిలకు సీపీ హెచ్చరిక

పెళ్లి పేరుతో జరిగే మోసాలపై యువతులు అప్రమత్తంగా ఉండాలని సీపీ సజ్జనార్​ సూచించారు. డబ్బులు డిమాండ్​ చేస్తే ఫిర్యాదు చేయాలన్నారు.