అక్షరటుడే, హైదరాబాద్: Komatireddy : టాలీవుడ్(Tollywood)లో సినీ పరిశ్రమ కార్మికులు (Cinema industry workers) సమ్మె బాట పట్టారు. తమ వేతనాలను 30 శాతం మేర పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Minister Komatireddy Venkat Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. కార్మికుల వేతనాలను పెంచాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు నిర్మాత దిల్ రాజు(producer Dil Raju)కు బాధ్యతలు అప్పగించినట్లు మంత్రి వెల్లడించారు. కార్మికుల డిమాండ్లపై చర్చించాలన్నారు. ఈ విషయంలో వెంటనే నిర్ణయం తీసుకోవాల్సిన అవసరాన్ని చెప్పుకొచ్చారు..
ఈ మేరకు తెలంగాణ మంత్రి Telangana Minister కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడారు.. “సినీ కార్మికుల జీతాలు పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది.. గ్రేటర్ హైదరాబాద్ లాంటి మహానగరంలో బతకాలంటే జీతాలు హైక్ కావాలి.. ప్రస్తుతం ఢిల్లీ పర్యటన ఉంది.. దీని తర్వాత కార్మికులతో నేరుగా మాట్లాడతా.. ఈ అంశాన్ని ప్రస్తుతం దిల్ రాజుకు అప్పగించాం.. దిల్‌రాజు నిర్మాతల కౌన్సిల్‌తో చర్చిస్తున్నారు..” అని పేర్కొన్నారు.
“తెలుగు సినీ పరిశ్రమ(Telugu film industry) లో పాన్ ఇండియా Pan India-level films స్థాయి సినిమాలు చిత్రీకరిస్తున్నారు. టికెట్ ధరలు పెంచేందుకు అనుమతులు కూడా ఇస్తున్నాం. ఈ క్రమంలో కార్మికుల డిమాండ్లపై చర్చించి, తగిన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.” అని మంత్రి అన్నారు.