అక్షరటుడే, వెబ్‌డెస్క్: తెలుగు సినీ పరిశ్రమ Telugu film industry మరో మంచి నటుడిని కోల్పోయింది. నాటకీయత, హావభావాలతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసిన ప్రఖ్యాత నటుడు కోట శ్రీనివాసరావు Kota Srinivasa Rao ఇక లేరన్న వార్త అభిమానులను శోకసంద్రంలో ముంచింది.
వృద్ధాప్య సంబంధిత ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన, ఆదివారం తెల్లవారుజామున (83 ఏళ్ల వయస్సులో) తుదిశ్వాస విడిచారు. కోట సినీ జీవితమే ఓ నాటకరంగం. నాలుగు దశాబ్దాల కెరీర్‌లో 750కు పైగా చిత్రాల్లో విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను ఎంతగానో మెప్పించారు.
పిసినారిగా నవ్విస్తూ, విలన్‌గా ముచ్చెమటలు పట్టిస్తూ, తండ్రిగా, మాంత్రికుడిగా, నేతగా, పోలీసుగా, కోటాగా ప్రతి పాత్రలో తనదైన శైలిలో నటించి ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు.
Kota Srinivasa Rao | ఈ వార్త తట్టుకోలేకపోతున్నాం..
కోట మరణంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి Telangana CM Revanth Reddy దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి Former Chief Minister, భారాస అధినేత BRS Chief కేసీఆర్ KCR సంతాపం తెలిపారు. త్రివిక్రమ్ శ్రీనివాస్, బాబు మోహన్, తనికెళ్ల భరణి, బ్రహ్మానందం వాటి వారు కూడా కోటకి నివాళులు అర్పించారు.
కోటా లేరన్న వార్త ప్రతి ఒక్కరిని కలిచి వేస్తోంది. ఆయనను చూస్తూ, ఆయన నుంచి నేర్చుకుంటూ పెరిగాను.. కోట బాబాయ్ నాకు కుటుంబం లాంటి వ్యక్తి.. ఆయనతో గడిపిన మధుర జ్ఞాపకాలను ఎప్పటికీ మరిచిపోలేను.. ఆయన ఆత్మకు శాంతి కలగాలి అంటూ రవితేజ ట్వీట్ చేశారు.
అలాగే దర్శకుడు బాబీ Bobby కూడా తన మనసులో మాటను ఇలా పంచుకున్నారు. ‘కోటా శ్రీనివాసరావు గారు పోషించిన ప్రతీ పాత్ర ఒక ప్రత్యేక అనుభూతి.. మీరు నవ్వించారు, ఏడిపించారు, కోపం తెప్పించారు. మిమ్మల్ని మర్చిపోవడం అసాధ్యం’ అని అన్నారు.
వైవిధ్యభరితమైన పాత్రలతో సినీ ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న ప్రముఖ నటులు కోట శ్రీనివాసరావు గారి మరణం విచారకరం. సుమారు నాలుగు దశాబ్దాల పాటు సినీ, నాటక రంగాలకు ఆయన చేసిన కళా సేవ, ఆయన పోషించిన పాత్రలు చిరస్మరణీయం. విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఆయన పోషించిన ఎన్నో మధురమైన పాత్రలు తెలుగు ప్రేక్షకుల మదిలో శాశ్వతంగా నిలిచిపోతాయి. ఆయన మృతి తెలుగు సినీ రంగానికి తీరనిలోటు. 1999లో విజయవాడ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ఆయన ప్రజాసేవ చేశారు. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను అని చంద్రబాబు Chandra babu Naidu ట్వీట్ చేశారు.