ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిRajiv Yuva Vikasam | ‘రాజీవ్‌ యువవికాసం’కు సిబిల్‌ తిప్పలు.

    Rajiv Yuva Vikasam | ‘రాజీవ్‌ యువవికాసం’కు సిబిల్‌ తిప్పలు.

    Published on

    అక్షరటుడే, కామారెడ్డి: Rajiv Yuva Vikasam | యువతకు సబ్సిడీపై (subsidi) రుణాలిచ్చేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజీవ్‌ యువవికాసం పథకానికి సిబిల్‌ స్కోర్‌ (CIBIL score) అడ్డంకిగా మారుతోంది. బ్యాంకులు సైతం లబ్ధిదారుల స్కోర్‌ను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటున్నాయి. దీంతో చాలామంది పథకానికి దూరం కానున్నారు. ప్రభుత్వం ఓవైపు సిబిల్‌ స్కోర్‌ (CIBIL score) ప్రాతిపదిక కాదని చెబుతున్నా.. బ్యాంకర్లు మాత్రం దాని ఆధారంగానే రుణాలు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

    రాజీవ్‌ యువ వికాస్‌ పథకం (Rajiv Yuva Vikas scheme) కింద ప్రభుత్వం రూ.50వేల నుంచి రూ.4లక్షల వరకు రుణాలు అందించనుంది. జిల్లాకు 13.450 యూనిట్లు మాత్రమే కేటాయించింది. మొత్తం 44,739 మంది దరఖాస్తు చేసుకున్నారు. రుణాల మంజూరులో సిబిల్‌ స్కోర్‌ (CIBIL score) కీలకంగా మారనున్నట్లు తెలుస్తోంది. గతంలో బ్యాంకులు, ప్రైవేట్‌ ఫైనాన్స్‌ల్లో తీసుకున్న రుణాలు సక్రమంగా చెల్లించకపోతే సిబిల్ స్కోర్‌ cibil score పడిపోతుంది. కానీ, ఎంతోమంది వివిధ కారణాలతో రుణాలు సక్రమంగా చెల్లించకపోవడంతో వారికి సిబిల్‌ స్కోర్‌ ఉండదు. ఈ పథకానికి వీరంతా అనర్హులు కానుండడంతో, ఆందోళన మొదలైంది. దీంతోపాటు ఇదివరకే ప్రభుత్వం నుంచి సబ్సిడీ రుణాలు పొందినవారు కూడా అనర్హులు కానున్నారు.

    Rajiv Yuva Vikasam | మొదటి విడతలో రూ.50 వేలకే..

    రాజీవ్‌ యువ వికాస్‌ కింద ప్రభుత్వం(Government) మొదటగా రూ.50 వేల రుణం కోసం దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే మంజూరు కానుంది. జిల్లాలో 1127 మంది ఈ రుణాలకు దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తులను పరిశీలించిన అనంతరం అర్హులను ఎంపిక చేయనున్నారు. మిగిలినవారికి విడతలవారీగా రుణాలు అందించనున్నారు.

    Rajiv Yuva Vikasam | పైరవీల కోసం ప్రదక్షిణలు..

    జిల్లాలో ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకున్న వారికి తమకు రుణం మంజూరవుతుందో, లేదోనన్న ఆందోళన నెలకొంది. ఇప్పటికే తమకు తెలిసిన నాయకుల ద్వారా పైరవీలు ప్రారంభించారు. ఎలాగైనా రుణం ఇప్పించాలని నాయకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కొందరు చోట మోటా నాయకులు పైరవీలు చేస్తూ.. కమీషన్‌ కూడా డిమాండ్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

    ప్రక్రియ కొనసాగుతోంది..

    – సురేందర్, జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్

    జిల్లాలో రాజీవ్ యువ వికాసం దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ కొనసాగుతోంది. మొత్తం 44,739 దరఖాస్తులు వచ్చాయి. ప్రభుత్వం 13,450 యూనిట్లు మంజూరు చేసింది. మొదటి విడతలో 1,127 మందికి రూ.50వేల చొప్పున రుణాలు మంజూరు చేస్తాం. బ్యాంకర్లు సిబిల్ స్కోర్ అడుగుతున్నారని తెలిసింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు రుణాలు మంజూరవుతాయి.

    Latest articles

    TNGOs Nizamabad | టీఎన్జీవోస్​ ఆధ్వర్యంలో జయశంకర్​కు ఘననివాళి

    అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్​: TNGOs Nizamabad | తెలంగాణ సిద్ధాంతకర్త జయశంకర్ (jayashankar) జయంతి సందర్భంగా ఆయనకు టీఎన్జీవోస్​...

    RTC tour package | చిలుకూరు బాలాజీ, అనంతగిరికి ఆర్టీసీ టూర్ ప్యాకేజీ

    అక్షరటుడే, బాన్సువాడ: RTC tour package | నిజామాబాద్​ రీజియన్​ పరిధిలోని పలు డిపోల నుంచి ఆర్టీసీ ప్రత్యేక...

    Megastar Chiranjeevi | చిరంజీవి ద‌గ్గ‌ర‌కు వెళ్లిన వేత‌నాల వివాదం.. పరిష్కారం దిశ‌గా చ‌ర్చ‌లు జ‌రిపేందుకు ప్లాన్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Megastar Chiranjeevi | టాలీవుడ్‌లో ప్రస్తుతం వేతనాల పెంపు సమస్య పెద్ద చర్చగా మారింది....

    IPO Listing | లాభాలను అందించిన లోటస్‌, ఎన్‌ఎస్‌డీఎల్‌.. ఫ్లాట్‌గా ప్రారంభమైన ఎంబీ ఇంజినీరింగ్‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : IPO Listing | దేశీయ స్టాక్‌ మార్కెట్‌(Domestic stock market)లో బుధవారం మెయిన్‌ బోర్డ్‌కు...

    More like this