అక్షరటుడే, కామారెడ్డి : CI Narahari | పట్టణ సీఐ నరహరి మానవత్వం చాటుకున్నారు. కామారెడ్డి (Kamareddy) పట్టణంలోని రైల్వే స్టేషన్లో గత కొద్దిరోజులుగా వర్షానికి తడుస్తూ ఓ వృద్ధురాలు ఉంటోంది. కొడుకులు వదిలేయడంతో ఎవరైనా భోజనం ఇస్తే తింటూ అక్కడే ఉంటోంది.
వృద్ధురాలి పరిస్థితికి చలించిన సీఐ నరహరి (CI Narahari) తమ సిబ్బందితో కలిసి రైల్వే స్టేషన్లో ఉన్న వృద్ధురాలిని ఓ ఆటోలో ముందుగా జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స అందించిన తర్వాత వృద్ధాశ్రమానికి తరలించారు. దీంతో పలువురు సీఐని అభినందిస్తున్నారు.
CI Narahari | సపర్యలు చేసిన మాజీ మున్సిపల్ ఛైర్మన్
మరోవైపు పోలీసులతో పాటు అక్కడికి చేరుకున్న మాజీ మున్సిపల్ ఛైర్మన్ గడ్డం ఇందుప్రియ (Gaddam Indupriya) వృద్ధురాలికి అండగా నిలిచారు. వృద్ధురాలి పతిస్థితిని చూసి దుస్తులు మార్పించారు. టీ తాగించి, స్వయంగా ఇడ్లీ తినిపించారు. వృద్ధురాలితో (Old Woman) పాటు ఆటోలో ఆస్పత్రికి వెళ్లి సపర్యలు చేసి అక్కడి నుంచి వృద్ధాశ్రమానికి తరలించే వరకు వెంట ఉన్నారు.