ePaper
More
    HomeతెలంగాణACB Trap | లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సీఐ, కానిస్టేబుల్​

    ACB Trap | లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సీఐ, కానిస్టేబుల్​

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB Trap | అవినీతి అధికారులు మారడం లేదు. ప్రజలను లంచాల పేరిట వేధిస్తూనే ఉన్నారు. నిత్యం ఏసీబీ దాడులు (ACB Raids) చేపడుతున్నా లంచాలకు మరిగిన అధికారులు భయపడటం లేదు. తాజాగా లంచం తీసుకుంటూ సీఐ, కానిస్టేబుల్ రెడ్​ హ్యాండెడ్​గా దొరికారు.

    మహబూబాబాద్ (Mahabubabad) జిల్లాలోని డోర్నకల్ పోలీస్​ స్టేషన్​లో భూక్యా రాజేష్​ సీఐగా (Dornakal CI Rajesh) పని చేస్తున్నాడు. ఇటీవల నమోదైన ఓ కేసులో ఆయన వాహనాన్ని స్వాధీనం చేసుకున్నాడు. ఆ వాహనాన్ని విడుదల చేయడంతో పాటు, కేసులో సాయం చేయడానికి సీఐ రూ.50 వేల లంచం డిమాండ్​ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులకు సమాచారం అందించాడు. ఈ మేరకు శనివారం బాధితుడి నుంచి సీఐ రాజేష్, అతని గన్​మెన్, పోలీస్ కానిస్టేబుల్ ధారావత్ రవి రూ.30 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్​గా పట్టుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, ఇద్దరిని అరెస్ట్​ చేశారు.

    ACB Trap | లంచం అడిగితే ఫోన్​ చేయండి

    ప్రజలు అధికారులకు లంచాలు ఇవ్వొద్దని ఏసీబీ అధికారులు సూచిస్తున్నారు. ఎవరైనా లంచం అడిగితే భయపడకుండా ఏసీబీకి ఫోన్​ చేయాలని చెబుతున్నారు. 1064 టోల్​ ఫ్రీ నంబర్ (ACB Toll Free Number)​, వాట్సాప్ నంబర్​ 9440446106కు సమాచారం అందిస్తే అవినీతి అధికారుల పని పడతామని భరోసా ఇస్తున్నారు. ఎంత మొత్తం లంచం అడిగినా.. వస్తు రూపంలో బహుమతులు అడిగినా తమకు ఫిర్యాదు చేయాలని కోరుతున్నారు. ఏసీబీకి ఫిర్యాదు చేస్తే తర్వాత తమ పనులు కావేమోనని పలువురు భయపడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అధికారులు తెలిపారు. ఎలాంటి భయం వద్దని, ఆ పని పూర్తయ్యే వరకు బాధితులకు ఏసీబీ అండగా ఉంటుందని అధికారులు భరోసా ఇస్తున్నారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.

    More like this

    Local Body Elections | ఎన్నెన్ని ‘కలలో’.. స్థానిక ఎన్నికల కోసం ఆశావహుల నిరీక్షణ

    అక్షరటుడే, కామారెడ్డి : Local Body Elections | రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలపై (local body elections)...

    ACB Raid | రూ.4 లక్షల లంచం తీసుకుంటూ దొరికిన అధికారిణి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB Raid | అవినీతి అధికారులు రెచ్చిపోతున్నారు. కార్యాలయాలకు వచ్చే వారి నుంచి అందిన...

    Sub Collector Vikas Mahato | పీహెచ్​సీ సబ్​సెంటర్​ నిర్మాణం కోసం స్థల పరిశీలన

    అక్షరటుడే, కోటగిరి: Sub Collector Vikas Mahato | పోతంగల్ (Pothangal)​ మండలంలోని హెగ్డేలి(Hegdely) గ్రామానికి మంగళవారం బోధన్​...