Choreographer Krishna
Choreographer Krishna | పోక్సో కేసు.. ఢీ డ్యాన్సర్, కొరియోగ్రాఫ‌ర్ కృష్ణ మాస్ట‌ర్ అరెస్ట్‌

అక్షరటుడే, వెబ్​డెస్క్: Choreographer Krishna | తెలుగు సినీ పరిశ్రమలో లైంగిక వేధింపుల ఆరోపణలు మళ్లీ చర్చకు తెరలేపాయి. ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ కు కొరియోగ్రాఫర్‌గా పని చేసిన కృష్ణ మాస్టర్ (Choreographer Krishna Master) ఒక మైనర్ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించాడన్న ఆరోపణలతో పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.

ఈ ఘటన హైదరాబాద్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ (Gachibowli police station) పరిధిలో చోటు చేసుకుంది. బాధిత బాలిక కుటుంబ సభ్యులు గత నెలలోనే కృష్ణ మాస్టర్‌పై పోక్సో చట్టం (POCSO ACT) కింద కేసు నమోదు చేశారు. అనంతరం ఆయన కనిపించకుండా పోయినట్లు సమాచారం.

Choreographer Krishna | దొరికిపోయాడు..

పోలీసులు కొద్ది రోజులుగా అత‌ని కోసం గాలించి, బెంగళూరులోని (Bengaluru) ఆయన అన్న నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. రిమాండ్‌కు తరలించిన కృష్ణ మాస్టర్‌ను అనంతరం సంగారెడ్డి జిల్లా (Sangareddy district) కంది జైలుకు తరలించారు. ఇదిలా ఉంటే, కృష్ణ మాస్టర్ ఇటీవలే ఓ మహిళను వివాహం చేసుకున్నాడు.

అయితే, అప్పటికే పెళ్లయిన మహిళతో సంబంధం పెట్టుకుని, ఆమె వద్ద నుంచి రూ. 9.50 లక్షల నగదు తీసుకుని మోసం చేసి పరారయ్యాడన్న ఆరోపణలు కూడా వెలుగుచూశాయి. కృష్ణ మాస్టర్‌పై ఇదే తొలిసారి కాదు. గతంలోనూ ఇన్‌స్టాగ్రామ్‌ (Instagram) ద్వారా పలువురు యువతులను, మహిళలను మోసం చేశాడన్న ఆరోపణలు వచ్చాయి. పలు ఫిర్యాదుల తర్వాత కూడా ఆయనపై చర్యలు తీసుకోవడంలో ఆలస్యం జరిగిందన్న విమర్శలు ఉన్నాయి.

సినీ పరిశ్రమలో ఇటీవల వరుసగా కొరియోగ్రాఫర్‌లు, టెక్నీషియన్లపై వచ్చే లైంగిక వేధింపుల ఆరోపణలు, బాధితుల భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై వచ్చిన ఆరోపణలు మరిచిపోకముందే, తాజాగా కృష్ణ మాస్టర్ అరెస్ట్ కావడం పరిశ్రమలో కలకలం రేపుతోంది. ఈ కేసుతో పాటు బాధితుల కోసం న్యాయం చేకూరేలా చూడాలని మ‌హిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. సినీ రంగంలో పనిచేస్తున్న మహిళలు, బాలికల భద్రతపై ప్ర‌త్యేక జాగ్ర‌త్త‌లు తీసుకోవాల్సిన అవసరం మరింత స్పష్టంగా కనిపిస్తోంది. కృష్ణ మాస్ట‌ర్ డ్యాన్సర్​గా ఈ పరిశ్రమలోకి వచ్చి ఢీ షో సీజన్స్(Dhee Show seasons)లో పాల్గొన్నాడు. సూపర్ జోడిలో రన్నరప్​గా, డ్యాన్స్ ఐకాన్​లో విన్నర్​గా నిలిచాడు. ఇక‌ మట్కా సినిమాతో కొరియోగ్రాఫర్​గా మారి ప్ర‌స్తుతం పలు సినిమాలకు కొరియోగ్రఫీ చేస్తున్నారు.