HomeసినిమాOG Movie | ‘OG’ మూవీపై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసల జల్లు.. హాలీవుడ్ స్థాయిలో ఉందంటూ...

OG Movie | ‘OG’ మూవీపై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసల జల్లు.. హాలీవుడ్ స్థాయిలో ఉందంటూ చిరు ప్ర‌శంస‌లు

అక్షరటుడే, వెబ్​డెస్క్​ : OG Movie | పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ‘OG’ చిత్రంపై మెగాస్టార్ చిరంజీవి తన అభిమానాన్ని బయటపెట్టారు.

కుటుంబంతో కలిసి ఈ సినిమాను వీక్షించిన చిరు, ఇది ఒక హాలీవుడ్ స్థాయిలో తీసిన అండర్‌వర‌ల్డ్ గ్యాంగ్‌స్టర్ డ్రామా అంటూ ప్రశంసలతో ముంచెత్తారు. గ‌త రాత్రి మా కుటుంబంతో కలిసి OG చూశాం. ప్రతి బిట్ ఎంజాయ్ చేశాను. హాలీవుడ్ ప్రమాణాలకు ఏ మాత్రం తగ్గకుండా అద్భుతంగా తీశారు. దర్శకుడు సుజీత్‌(Director Sujeeth) ప్రతిభ అసాధారణం. తెరపై పవన్ కల్యాణ్‌ను చూసి ఎంతో గర్వంగా అనిపించింది” అని పేర్కొన్నారు.

OG Movie | సినిమాపై చిరు ఫుల్ ప్రశంసలు

OGలోని ఎమోషన్స్, స్టైల్, స్వాగ్, అన్నీ చాలా బాగా బలంగా నిలిచాయని చిరంజీవి(Megastar Chiranjeevi) అభిప్రాయపడ్డారు. పవన్ కల్యాణ్ ప్రెజెన్స్ సినిమాను నిలబెట్టిందని, అభిమానులకు ఇది పండుగలాంటిదే అని వివరించారు.దర్శకుడు సుజీత్ ఈ సినిమాను మొదటి నుండి చివరి వరకు అత్యంత క్లాస్‌గా తెరకెక్కించారని అన్నారు.సంగీత దర్శకుడు ఎస్.ఎస్. తమన్ గురించి చిరు ప్రత్యేకంగా స్పందించారు. తమన్ తన హృదయాన్ని, ఆత్మను OG సంగీతంలో పోశాడు. ప్రతి బీట్‌కు ఆయన తపన కనిపిస్తుంది” అని మెచ్చుకున్నారు.

సినిమాటోగ్రాఫర్ రవి కె. చంద్రన్ అందించిన విజువల్స్ అద్భుతంగా ఉన్నాయన్నారు.ఎడిటింగ్, ఆర్ట్ డిపార్ట్‌మెంట్ బలంగా నిలిచాయని కొనియాడారు.నిర్మాత దానయ్య(Producer Danayya) మరియు మొత్తం చిత్రబృందానికి చిరు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు.త‌మ్ముడి సినిమాకి మెగాస్టార్ ఇలా ఓపెన్‌గా స్పందించడంతో, సోషల్ మీడియాలో చిరు పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.ఫ్యాన్స్ రెస్పాన్స్ కూడా అదే స్థాయిలో కనిపిస్తోంది. “చిరు చెప్పినంత గొప్పగా OG ఉందంటే.. థియేటర్‌లో చూడక తప్పదు!” అంటూ కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. పవన్ కల్యాణ్, సుజీత్ కాంబోలో వచ్చిన OG(OG Movie) ఇప్పటికే ట్రైలర్, టీజర్ లెవెల్‌లో హైప్ క్రియేట్ చేసింది. ఇప్పుడు చిరు రివ్యూ తర్వాత మరింతగా సినిమాపై పాజిటివ్ వైబ్స్ పెరిగాయి. సినిమా త్వరలోనే మ‌రిన్ని థియేట‌ర్స్‌లో విడుద‌లయ్యే అవ‌కాశం క‌నిపిస్తుంది.