అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Chiranjeevi tweet | తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు హీరో విజయ్ (Hero Vijay) ఎన్నికల ప్రచార ర్యాలీలో జరిగిన తొక్కిసలాటలో దాదాపు 39 వరకు మరణించారు. ఈ ఘటన దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. దీనిపై పలువురు ప్రముఖులు సోషల్ మీడియా (Social Media) వేదికగా స్పందిస్తున్నారు.
తాజాగా మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) తమిళనాడులోని కరూర్ ర్యాలీలో జరిగిన విషాదకరమైన తొక్కిసలాటపై స్పందిస్తూ.. ఈ ఘటన నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది అని అన్నారు Chiranjeevi. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం తెలియజేస్తున్నాను. వారి కుటుంబాలకు నా హృదయపూర్వక సానుభూతి. ఈ క్లిష్ట సమయంలో వారికి బలం చేకూరాలని కోరుకుంటున్నాను. అలాగే ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను అంటూ ట్వీట్ చేశారు చిరు.
Chiranjeevi tweet | తొక్కిసలాట ఎలా జరిగింది?
కాగా, తమిళనాడులోని కరూర్ జిల్లా (Karur district) మాడంపురి ప్రాంతంలో ప్రముఖ సినీ నటుడు, తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత విజయ్ Vijay నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఘోర విషాదం చోటు చేసుకుంది. సభకు లక్షలాదిమంది తరలిరావడంతో ఏర్పడిన తొక్కిసలాటలో ఇప్పటివరకు 39 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 8 మంది చిన్నారులు, 16 మందికిపైగా మహిళలు ఉన్నారు. ఈ ఘటనలో 400 మందికిపైగా గాయపడ్డారు. వారి చికిత్స వివిధ దవాఖానల్లో కొనసాగుతోంది.
విజయ్‌ను చూసేందుకు, ఆయన ప్రసంగాన్ని వినేందుకు అభిమానులు, పార్టీ కార్యకర్తలు తెల్లవారుజాము నుంచే కార్యక్రమ స్థలానికి భారీగా తరలివచ్చారు. విజయ్ రాక కోసం ఆరు గంటలకు పైగా ఎదురుచూస్తూ ఉన్న వారిలో అసహనం పెరిగింది. ఎట్టకేలకు విజయ్ ప్రత్యేక బస్సులో వేదిక వద్దకు రాగానే ఒక్కసారిగా జనం ముందుకు వెళ్లడంతో తోపులాట మొదలై, తొక్కిసలాటకు దారితీసింది.
విజయ్ ప్రసంగిస్తున్న సమయంలో పరిస్థితి మరింత విషమించడంతో ఆయన తన ప్రసంగాన్ని నిలిపివేశారు. అంబులెన్సులు (Ambulence) సమయానికి చేరలేకపోవడం, రహదారులు జనంతో మూసుకుపోవడంతో బాధితులను ఆసుపత్రులకు తరలించడంలో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ విషాదకర ఘటనపై తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ (Tamil Nadu Chief Minister Stalin), కేంద్ర హోం మంత్రి అమిత్ షా లు స్పందించారు. అమిత్ షా, సీఎం స్టాలిన్‌తో ఫోన్ ద్వారా మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. అవసరమైన అన్ని సహాయాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు.