అక్షరటుడే, హైదరాబాద్: Chiranjeevi meets CM : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆదివారం (ఆగస్టు 3) రాత్రి కేంద్ర మాజీ మంత్రి (Former Union Minister), సినీ నటుడు చిరంజీవి (film actor Chiranjeevi) కలిశారు. జూబ్లీహిల్స్ లోని రేవంత్ నివాసానికి చిరంజీవి వెళ్లారు. అక్కడ సీఎంతో చిరంజీవి భేటీ కావడం ఇటు రాజకీయ,అటు సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది.
ముఖ్యమంత్రితో చిరంజీవి మర్యాదపూర్వకంగానే భేటీ అయినట్లు చెబుతున్నారు. వీరి ఆకస్మిక భేటీకి రాజకీయ కారణాలు ఏమీ లేవని పేర్కొంటున్నారు. కేవలం ఇరువురి మధ్య సాన్నిహిత్యం వల్లనే కలుసుకున్నారని అంటున్నారు. కానీ, దీని వెనుక ఏదో ఆంతర్యం ఉందనేది టాక్.
Chiranjeevi meets CM : ఇంటి పునరుద్ధరణ పనులు..
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసం ఉన్న జూబ్లీహిల్స్ (Jubilee Hills) లో నే చిరంజీవి ఇళ్లు ఉంది. కాగా, తన ఇంటిని పునరుద్ధరించాలని ఆయన భావించారు. ఇందుకు సంబంధించిన పనులను క్రమబద్ధీకరించాలని చిరంజీవి చేసుకున్న దరఖాస్తును నాలుగు వారాల్లోగా పరిష్కరించాలని హైకోర్టు ఇటీవల జీహెచ్ఎంసీని ఆదేశించింది.
ఇంటి పునరుద్ధరణ పనుల్లో భాగంగా రిటైన్ వాల్ నిర్మించారు. ఈ నిర్మాణాన్ని క్రమబద్ధీకరణకు కోరుతూ చిరంజీవి జూన్ 5న దరఖాస్తు చేసుకున్నారు. కానీ, ఈ దరఖాస్తు జీహెచ్ఎంసీ వద్దే పెండింగులో ఉంది. దీంతో వెంటనే పరిష్కించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
చిరంజీవి పిటిషన్పై ఇటీవల న్యాయమూర్తి జస్టిస్ బి. విజయ్ సేన్ రెడ్డి విచారణ చేపట్టారు. 2002లో గ్రౌండ్, మరో రెండంతస్తుల నిర్మాణానికి అనుమతి తీసుకున్నారని చిరంజీవి తరఫున న్యాయవాది గుర్తుచేశారు. ముందస్తు జాగ్రత్త చర్యగా పునరుద్ధరణ పనులకు అనుమతులు కోరుతున్నట్లు వివరించారు. దీనిపై జీహెచ్ఎంసీ న్యాయవాది వివరణ ఇచ్చారు. చట్టప్రకారమే దరఖాస్తుపై తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు చెప్పుకొచ్చారు.