అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Megastar Chiranjeevi | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లా(Karnool District), ఆదోని పట్టణానికి చెందిన రాజేశ్వరి అనే మహిళా అభిమాని, తన అభిమాన నటుడు మెగాస్టార్ చిరంజీవిని కలవాలన్న కోరికతో సైకిల్‌పై వందల కిలోమీటర్ల ప్రయాణం చేస్తూ హైదరాబాద్ (Hyderabad) చేరుకున్నారు. ఆమె శారీరక, మానసిక సవాళ్లన్నింటికీ దాటుకొని ఎట్టకేలకు చిరంజీవి ఇంటికి చేరింది. అయితే తనకోసం సైకిల్ మీద హైదరాబాద్‌కు వచ్చిందని తెలుసుకున్న చిరంజీవి, రాజేశ్వరిని (Female Fan Rajeshwari) తన నివాసానికి ఆహ్వానించి, ఆమె అంకితభావానికి పలు గిఫ్ట్‌లు అందించారు. మరోవైపు రాజేశ్వరి మెగాస్టార్‌కు రాఖీ కట్టి, తన సోదరుడిగా భావిస్తున్నట్లు ఎమోషనల్ అయింది.
Megastar Chiranjeevi | ఇది కదా చిరు అంటే..
ఆమెను ఓదార్చిన చిరంజీవి (Megastar Chiranjeevi), తన ఆశీస్సులతో పాటు చీరను బహుమతిగా అందించారు. ఈ భేటీలో ముఖ్య ఘట్టం.. చిరంజీవి చూపిన మానవతా దృక్పథం. రాజేశ్వరి కుటుంబ పరిస్థితిని గమనించిన మెగాస్టార్, ఆమె పిల్లల విద్యాభవిష్యత్తును తన భుజాలపై వేసుకుంటానని ప్రకటించారు. వారి చదువుకు అవసరమైన ఆర్థిక సాయాన్ని అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ సంఘటన సోషల్ మీడియా అంతటా వైరల్ అవుతోంది. చిరంజీవి పెద్ద మనసుకు నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. “తెరపై కాకుండా, నిజ జీవితంలోనూ చిరు మెగాస్టార్!” అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
ఇక చిరంజీవి ఇప్పటికీ యువ హీరోలతో పోటీ పడుతూ సినిమాలు చేస్తున్నారు. “విశ్వంభర” సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి చేయగా, ఈ మూవీని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయనున్నారు. అలాగే అనిల్ రావిపూడి దర్శకత్వంలో “మన శంకర వరప్రసాద్” అనే మరో ప్రాజెక్ట్‌లో కూడా నటిస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతికి విడుదల కానుంది. ఈ మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే సినిమాల పరంగానే కాకుండా రియల్ లైఫ్‌లో అభిమానుల పట్ల చిరంజీవి చూపిస్తున్న ఆప్యాయతకి నెట్టింట ప్రశంసలే కాదు, అపారమైన గౌరవం కూడా లభిస్తోంది.