అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Megastar Chiranjeevi | సెలబ్రిటీలు అయినా, సామాన్యులు అయినా… భార్య ముందు భర్తలు కొంచెం వినయంగా ఉండాల్సిందే అన్న నిజాన్ని మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) కూతురు సుస్మిత కొణిదెల హ్యూమరస్‌గా బయటపెట్టారు.
రీసెంట్‌గా బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న “కిష్కింధాపురి” ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ప్రత్యేక అతిథిగా హాజరైంది సుస్మిత (Sushmita Konidela). ఇక ప్రేక్షకుల ముందే చిరంజీవికి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని పంచుకున్నారు. తాజాగా తన తండ్రి చిరంజీవి నటిస్తున్న కొత్త సినిమా కోసం ప్రస్తుతం ఓ సాంగ్ షూట్ జరుగుతుండగా అక్కడ జరిగిన ఘటనను సుస్మిత వివరించారు.
Megastar Chiranjeevi | సీక్రెట్ రివీల్..
సెట్‌లో డ్యాన్స్ సీన్స్ ఎంతో ఎనర్జీగా చేస్తున్నారు నాన్న. కానీ అమ్మ (Surekha) వచ్చి కూర్చోగానే.. ఆయన స్టెప్స్ మర్చిపోయారు! డ్యాన్సుల్లో తడబడిపోయారు. అది చూడగానే మా అందరికీ నవ్వొచ్చింది,” అని ఆమె చెప్పింది. ఈ మాట విని యాంకర్ సుమ సహా ప్రేక్షకులందరూ నవ్వేశారు. వెంటనే సుస్మిత చమత్కారంగా “అంతటి మెగాస్టార్ అయినా భార్య పక్కన ఉంటే కాస్త తడబడాల్సిందే!” అని వ్యాఖ్యానించారు. ఈ క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు.. “భయపడే రాకింగ్ స్టార్ – మెగాస్టార్!, “సురేఖ గారి ఫ్రెజెన్స్‌లో చిరు గారు కూడా రెగ్యులర్ హస్బెండ్‌లానే ఉన్నారు!” అని హ్యూమరస్‌గానే స్పందిస్తున్నారు.
ఇక చిరంజీవి నటిస్తున్న తాజా సినిమా విషయానికి వస్తే, మా శంకర్ వరప్రసాద్ గారు అనే టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రానికి అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వం వహిస్తున్నాడు. నయనతార కథానాయికగా నటిస్తుండగా, ప్రస్తుతం షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ బడ్జెట్ భారీగా ఉండగా, నిర్మాతలుగా సాహు గారపాటి మరియు సుస్మిత కొణిదెల వ్యవహరిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ చిత్రం. మూవీ పక్కా హిట్ అనే హోప్స్ తో ఆడియన్స్ ఉన్నారు. ఇందులో వెంకీ కూడా ఓ ముఖ్య పాత్ర పోషించనున్నారు.