HomeUncategorizedwaves summit | వేవ్ స‌మ్మిట్‌లో చిరంజీవి సంద‌డి.. ఇండియ‌న్ సినిమా ఉన్నత శిఖరాలకు చేరింద‌న్న...

waves summit | వేవ్ స‌మ్మిట్‌లో చిరంజీవి సంద‌డి.. ఇండియ‌న్ సినిమా ఉన్నత శిఖరాలకు చేరింద‌న్న మోదీ

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​: waves summit | ముంబ‌యిలోని జియో వ‌రల్డ్ సెంట‌ర్‌(Jio world center)లో ప్ర‌పంచ ఆడియో విజువ‌ల్ అండ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ స‌మ్మిట్ (WAVES) 2025 అట్ట‌హిసంగా ప్రారంభ‌మైంది. భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ ఈ ఈవెంట్ లాంచ్ చేయ‌గా, ఈ కార్య‌క్ర‌మంలో భార‌తీయ చ‌ల‌న‌చిత్ర ప‌రిశ్రమని ఉద్దేశించి ప్ర‌సంగించారు. చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ అభివృద్ధికి న‌టీన‌టులు, క‌ళాకారులు అందిస్తోన్న సేవ‌ల‌ను ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని ప్ర‌శంసించారు. నాలుగు రోజులపాటు ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఈ సదస్సులో ప్రధాని మాట్లాడుతూ.. వేవ్స్ (World Audio Visual and Entertainment Summit ) అనేది కేవలం ఒక పదం కాదని.. ఇది సంస్కృతి, సృజనాత్మకత, చలనచిత్ర సంగీతం, గేమింగ్, కథ చెప్పడం.. లాంటి కలయిక అని చెప్పుకొచ్చారు.

waves summit | మెగా ఎంట్రీ..

గత 100 సంవత్సరాలలో, భారతీయ సినిమా ఉన్నత శిఖరాలకు చేరుకుందని ప్రధాని మోదీ అన్నారు.ఈ వరల్డ్‌ ఆడియో విజువల్‌ అండ్‌ ఎంటర్టైన్మెంట్‌ సమ్మిట్ కోసం బాలీవుడ్, టాలీవుడ్ సహా.. భారత సినీ ఇండస్ట్రీకి చెందిన అగ్రనటులు, పలువురు వ్యాపార దిగ్గజాలు, కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల సీఎంలు హాజరయ్యారు.. బాలీవుడ్ నటులు అమితాబ్ బచ్చన్ , రణ్‌బీర్ కపూర్ , దీపికా పదుకొనే, ప్రియాంక చోప్రా, రజనీకాంత్, చిరంజీవి Chiranjeevi, మోహన్ లాల్ సహా ఇతర ప్రపంచ తారలు పాల్గొన్నారు. వీరికి నిర్వాహ‌కులు ఘ‌న స్వాగ‌తం పలికారు. బుధ‌వార‌మే చిరంజీవి ఈ కార్య‌క్ర‌మం కోసం హైద‌రాబాద్ నుంచి ముంబ‌యి చేరుకున్న విష‌యం తెలిసిందే.

వేవ్ స‌మ్మిట్ అనేది మీడియా, వినోద పరిశ్రమల‌ను ఒకచోట చేర్చే నాలుగు రోజుల కార్యక్రమం కాగా, ఈ కార్య‌క్ర‌మంలో మోడీ.. మీడియా, వినోద రంగానికి చెందిన సీఈఓలు, పరిశ్రమల ప్రముఖులతో భేటీ కానున్నారు. ఈ కార్య‌క్ర‌మం కోసం ప్ర‌ధాని మోదీ ఏకంగా 10 గంట‌ల స‌మ‌యాన్ని కేటాయించ‌డం విశేషం. అంత‌ర్జాతీయ స్థాయిలో భార‌త్‌ Indiaను గ్లోబ‌ల్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ హ‌బ్‌గా మార్చాల‌నే ల‌క్ష్యంతో కేంద్రం ‘వేవ్స్’ కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టింది. ఇది మీడియా, వినోద పరిశ్రమల‌ను ఒకచోట చేర్చే అద్భుత కార్యక్ర‌మం. 90కి పైగా దేశాల నుంచి పదివేల మందికి పైగా ప్రతినిధులు, 300కి పైగా కంపెనీలు, 350కి పైగా స్టార్ట్‌ అప్‌లు ఈ భారీ సదస్సులో భాగం కానున్నాయి..