Chinna Pothangal |చిన్న పోతంగల్‌లో రెండిళ్లలో చోరీ
Chinna Pothangal |చిన్న పోతంగల్‌లో రెండిళ్లలో చోరీ

అక్షరటుడే, గాంధారి: Chinna Pothangal | మండలంలోని చిన్నపోతంగల్‌లో (chinna pothangal) బుధవారం తెల్లవారుజామున రెండిళ్లలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. గ్రామానికి చెందిన కుమ్మరి రోజా తన ఇంటికి తాళం వేసి అదే గ్రామంలోని తన తల్లిగారింటికి వెళ్లింది. దీంతో గుర్తు తెలియని దొంగలు ఇంట్లోకి చొరబడి ఏడున్నర మాసాల బంగారం (gold), 12 తులాల వెండి, నగదు (silver and cash) ఎత్తుకెళ్లినట్లు బాధితురాలు పేర్కొంది. అలాగే అదే గ్రామానికి చెందిన కొర్రి గౌరవ్వ ఇంట్లో చొరబడిన ఇద్దరు దుండగులు కత్తితో బెదిరించి 12 తులాల వెండి, నగదు, బంగారు (silver, cash and gold) గుండ్లు అపహరించినట్లు బాధితురాలు తెలిపింది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఆంజనేయులు (SI Anjaneyulu) తెలిపారు. సంఘటనా స్థలాన్ని సీఐ సంతోష్‌ కుమార్‌ (CI Santosh Kumar) పరిశీలించారు.