అక్షరటుడే, హైదరాబాద్: Chinese Wok | ‘దేశీ చైనీస్’ క్విక్ సర్వీస్ రెస్టారెంట్ (quick service restaurant – QSR) అయిన చైనీస్ వోక్, తెలంగాణ Telangana, ఆంధ్రప్రదేశ్ (AP) లో తన ఉనికిని మరింత బలోపేతం చేసుకుంటోంది.
దీంతోపాటు దేశవ్యాప్తంగా “చైనీస్ బోలే తో.. చైనీస్ వోక్” అనే కొత్త ప్రచార కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రస్తుతం.. హైదరాబాద్ Hyderabad, విజయవాడ Vijayawada, గుంటూరు Guntur, విశాఖపట్నం Visakhapatnam లో 20 కంటే ఎక్కువ రిటైల్ స్టోర్‌లను నిర్వహిస్తోంది చైనీస్ వోక్.
ఈ ఆర్థిక సంవత్సరంలో మరో 5 – 8 స్టోర్‌లను తెరవాలని యోచిస్తోంది. తద్వారా మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పించాలని సంస్థ భావిస్తోంది.
Chinese Wok | కొత్త ప్రచారం గురించి..
కొత్త ప్రచార ప్రధానాంశం “చైనీస్ బోలే తో.. చైనీస్ వోక్”. ఈ ప్రచారాస్త్రం వినోదాన్ని పంచుతూనే, బ్రాండ్‌ను బలంగా గుర్తుంచుకునేలా చేస్తుందంటున్నారు కంపెనీ ప్రతినిధులు. దేశవ్యాప్తంగా చైనీస్ వోక్ ‘దేశీ చైనీస్’ కోరికలకు పర్యాయపదంగా ఉండేలా ఈ ప్రచారం దోహదపడుతుందంటున్నారు.
ఈ ప్రచారం గురించి లెనెక్సిస్ ఫుడ్‌వర్క్స్ వ్యవస్థాపకుడు, డైరెక్టర్ ఆయుష్ మధుసూదన్ అగర్వాల్ మాట్లాడుతూ.. “తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మాకు అత్యంత ఆశాజనకమైన మార్కెట్లు. ఇక్కడ మా ఫ్రాంచైజీలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఇక్కడి ప్రజలు ఫ్లేవర్స్‌ని బాగా ఇష్టపడతారు. హైదరాబాద్, విజయవాడ, వైజాగ్ వంటి నగరాలు మా ఘాటైన, స్పైసీ ఫ్లేవర్స్‌ను ఆదరించాయి. ‘చైనీస్ బోలే తో.. చైనీస్ వోక్’తో, మేము మా కేటగిరీ లీడర్‌షిప్‌ను సరదా సాంస్కృతిక అంశంతో కలుపుతున్నాం..” అని అన్నారు.
Chinese Wok | విస్తృత ప్రణాళిక
ప్రస్తుతం 45+ నగరాల్లో 240+ అవుట్‌లెట్‌లను నిర్వహిస్తున్న చైనీస్ వోక్.. 2027 నాటికి 500 అవుట్‌లెట్‌లకు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.