అక్షరటుడే, గాంధారి: Chinese manja | మండలంలో సంక్రాంతి పండుగను (Sankranthi festival) పురస్కరించుకుని జోరుగా చైనామాంజా (Chinese manja) విక్రయాలు సాగుతున్నాయి. మండల కేంద్రంలో ఓవైపు చికెన్ సెంటర్ నడుపుతూ ఇంట్లో గుట్టుగా చైనామాంజా విక్రయిస్తున్న వ్యవహారాన్ని శనివారం పోలీసులు బట్టబయలు చేశారు.
ఎస్సై ఆంజనేయులు (Sub-Inspector Anjaneyulu) తెలిపిన వివరాల ప్రకారం.. చికెన్ షాప్ నడుపుతున్న ఓ వ్యక్తి ఇంట్లో చైనామాంజా విక్రయిస్తున్నారనే పక్కా సమాచారంతో దాడులు చేశామన్నారు. ఆ వ్యక్తి ఇంట్లో సోదా చేయగా మాంజా చరకలు, చైనా మాంజాను గుర్తించి స్వాధీనం చేసుకున్నామన్నారు. అనంతరం ఆ వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రాణాంతకమైన చైనామంజాను నిలువ ఉంచినా.. విక్రయించినా చట్టప్రకారం కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.