Influencer Labor Controversy | భార్య ప్రసవ వేదనను వీడియోగా.. మధ్యలో యాడ్ ప్రమోషన్ .. పిచ్చి పీక్స్‌కి చేరిందేంటి..!

సియాటెల్‌లో నివసిస్తున్న చైనాకు చెందిన ఇన్‌ఫ్లుయెన్సర్ ‘పాల్ ఇన్ యూఎస్ఏ’ తన భార్య 23 గంటల ప్రసవ వేదనను వీడియోగా పోస్ట్ చేసి, అదే వీడియోలో పెయిడ్ యాడ్ చదివిన ఘటన తీవ్ర వివాదానికి దారి తీసింది. ప్రజాగ్రహం మధ్య డౌయిన్, వీబో అతడి ఖాతాలను నిషేధించాయి.

అక్షరటుడే, వెబ్​డెస్క్: Influencer Labor Controversy | వ్యూస్, డబ్బు కోసం కొందరు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు ఎంతకైనా దిగజారుతున్నారనే విమర్శలకు బలాన్నిచ్చే ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. అమెరికా (America)లోని సియాటెల్‌లో నివసిస్తున్న చైనాకు చెందిన ప్రముఖ ఇన్‌ఫ్లుయెన్సర్ ‘పాల్ ఇన్ యూఎస్ఏ’ (అసలు పేరు జౌ జావో) తన భార్య ప్రసవ సమయంలో తీసిన వీడియోపై తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నారు.

అమెరికాలోని సియాటెల్‌ (Seattle)లో నివసించే చైనాకు చెందిన ‘పాల్ ఇన్ యూఎస్ఏ ఓ ప్రముఖ ఇన్‌ఫ్లుయెన్సర్లు కాగా, అతడికి డౌయిన్ ప్లాట్‌ఫామ్‌పై 12.2 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఇటీవల తన భార్య 23 గంటల పాటు పడిన ప్రసవ వేదనను వీడియోగా చిత్రీకరించి ఆన్‌లైన్‌లో షేర్ చేశాడు. ఈ సమయంలో ఆమెకు 3,344 మిల్లీలీటర్ల వరకు తీవ్ర రక్తస్రావం జరగడంతో అత్యవసర శస్త్రచికిత్స చేయాల్సి వచ్చింది.

Influencer Labor Controversy | నెటిజన్ల ఆగ్రహం

భార్య ప్రాణాలతో పోరాడుతున్న పరిస్థితిలో కూడా పాల్ (Paul in USA) కెమెరా ఆపకుండా చిత్రీకరించడమే కాకుండా, వీడియో మధ్యలో శిశువుల న్యాపీల కోసం ఓ పెయిడ్ యాడ్ స్క్రిప్ట్ చదవడం తీవ్ర ఆగ్రహానికి దారి తీసింది. ఈ వీడియో సోషల్ మీడియా (Social Media)లో వైరల్ కావడంతో నెటిజన్లు మండిపడ్డారు. భార్య అంతటి బాధలో ఉంటే డబ్బు కోసం ఇలా చేయడం క‌రెక్టా? , ఇది కంటెంట్ కాదు, క్రూరత్వం అంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు. వ్యక్తిగత జీవితం, ప్రాణాపాయం వంటి సున్నితమైన విషయాలను వ్యూస్ కోసం ఉపయోగించడం నైతికతకు విరుద్ధమని అభిప్రాయపడ్డారు.

ఈ వివాదంపై పాల్ భార్య ఫిబ్రవరి 10న స్పందిస్తూ, ప్రసవ సమయంలో ఉండే రిస్క్‌లను ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో వీడియో తీశామని వివరణ ఇచ్చింది. అయితే, ప్రజాగ్రహం చల్లారలేదు. నిబంధనల ఉల్లంఘన ఆరోపణలతో పాటు కూడా ఫిబ్రవరి 11న అతడి ఖాతాలను నిషేధించాయి. ఈ ఘటన చైనా (China)లో ఆన్‌లైన్ కంటెంట్ నైతిక ప్రమాణాలపై పెద్ద చర్చకు దారి తీసింది. వ్యక్తిగత జీవితంలోని అత్యంత సున్నిత క్షణాలను పబ్లిసిటీ, ఆదాయం కోసం వినియోగించడం ఎంతవరకు సమంజసం? అనే ప్రశ్నలపై సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. మొత్తానికి, వ్యూస్ కోసం తీసిన ఒక వీడియో, ఇప్పుడు సోషల్ మీడియా నైతిక విలువలపై జాతీయ స్థాయి చర్చకు కారణమైంది.

Related articles

Arvind Ukraine Group | ఉక్రెయిన్ పార్లమెంటరీ ఫ్రెండ్​షిప్ గ్రూప్ టీం లీడర్​గా ఎంపీ అర్వింద్

ఉక్రెయిన్ పార్లమెంటరీ ఫ్రెండ్​షిప్ గ్రూప్ టీం లీడర్​గా ఎంపీ అర్వింద్ నియమితులయ్యారు. ఇరు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేయడం ఈ బృందం లక్ష్యం.

Tirumala Laddu Adulteration Issue | తిరుమల లడ్డూ కల్తీపై అసెంబ్లీలో చర్చ.. కుట్ర ఉందన్న సీఎం

తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యిపై ఏపీ అసెంబ్లీలో చర్చ జరిగింది. 2019-24 మధ్య దేవాలయాల్లో అరాచకాలు జరిగాయని సీఎం చంద్రబాబు అన్నారు.

Lawyers Protest Nizamabad | జిల్లా కోర్టు ఎదుట న్యాయవాదుల నిరసన.. దాడి చేసిన వారిని అరెస్ట్​ చేయాలని డిమాండ్​

న్యాయవాదిపై దాడి చేసిన వారిని అరెస్టు చేయాలని లాయర్లు డిమాండ్​ చేశారు. ఈ మేరకు మంగళవారం నిజామాబాద్ బార్​ అసోసియేషన్ ఆధ్వర్యంలో విధులు బహిష్కరించి కోర్టు ఎదుట ధర్నా చేశారు.

Harish Rao Demands Halt | పేదల ఇళ్ల కూల్చివేతలను ఆపాలి : హరీశ్​రావు

ఖమ్మం జిల్లా వినోబానగర్‌లో పేదల ఇళ్ల కూల్చివేతలను ఆపాలని హరీశ్​రావు డిమాండ్​ చేశారు. ప్రభుత్వ తీరును ఆయన ఖండించారు.