ePaper
More
    Homeఅంతర్జాతీయంPakistan | చైనా, తుర్కియే.. పాక్​కు ఆయుధాలు సరఫరా చేసే మూడో దేశం ఏదో తెలుసా..?

    Pakistan | చైనా, తుర్కియే.. పాక్​కు ఆయుధాలు సరఫరా చేసే మూడో దేశం ఏదో తెలుసా..?

    Published on

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Pakistan : పాకిస్తాన్ సైనిక శక్తికి సాయం చేసే దేశాలు మూడు ఉన్నాయి. చైనా(China), తుర్కియే(టర్కీ)(Turkey) కాకుండా.. అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తే మరొక దేశం పేరు తాజాగా వెలుగులోకి వచ్చింది. అదే నెదర్లాండ్స్(Netherlands).

    చైనా తర్వాత పాక్​కు రెండో అతిపెద్ద ఆయుధాల సరఫరాదారుగా ఉన్నది నెదర్లాండ్స్. ఈ నేపథ్యంలో ఈ దేశం కూడా బైకాట్​కు గురికాబోతుందా..? అనేది ప్రస్తుతం చర్చకు దారితీసింది. ఎందుకంటే నెదర్లాండ్స్ కు భారత్​ పెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది.

    విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్.జైశంకర్(External Affairs Minister Dr. S. Jaishankar) నెదర్లాండ్స్‌, డెన్మార్క్(Denmark), జర్మనీ(Germany) దేశాలలో పర్యటిస్తున్నారు. ఆరు రోజుల పర్యటనలో భాగంగా మే 19న నెదర్లాండ్స్ చేరుకున్నారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత.. ఎస్.జైశంకర్‌కు ఇది మొదటి విదేశీ పర్యటన కావడం గమనార్హం. కాగా, పాకిస్తాన్​కు రెండో అతిపెద్ద ఆయుధాలు సరఫరా దేశంలో భారత్​ విదేశాంగ మంత్రి పర్యటించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

    READ ALSO  African Migrant Boat | వలసదారులతో వెళుతున్న‌ పడవ బోల్తా.. 68 మంది మృతి, 74 మంది గల్లంతు

    ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపాలని నెదర్లాండ్స్ ప్రధాని, విదేశాంగ, రక్షణ మంత్రులను కలిసిన తర్వాత.. జైశంకర్ సామాజిక మాధ్యమ వేదిక X(ocial media platform X)లో ఒక పోస్టు పెట్టారు. ‘‘హేగ్‌(Hague)లో ప్రధాని డిక్ స్కాఫ్‌(Prime Minister Dick Schaaf)ను కలవడం ఆనందంగా ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) తరఫున శుభాకాంక్షలు తెలియజేశా. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నెదర్లాండ్స్ దృఢ వైఖరికి ధన్యవాదాలు తెలియజేశాను’’ అని రాసుకొచ్చారు.

    ‘‘భారతదేశం-నెదర్లాండ్స్ భాగస్వామ్యాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లాలనే ఆ దేశ ప్రధాని నిబద్ధతను అభినందిస్తున్నా. ఈ లక్ష్యాలు సాధించడానికి రెండు దేశాలు కష్టపడి పనిచేస్తాయనే నమ్మకం ఉంది.’’ అని కేంద్ర మంత్రి జైశంకర్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

    కాగా, పాకిస్తాన్​కు నెదర్లాండ్స్ అతిపెద్ద ఆయుధాలు సరఫరా చేసే రెండో దేశంగా ఉంది. అయితే నెదర్లాండ్​కు భారత్​ అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉండడం గమనార్హం. ఈ నేపథ్యంలో భారత్​ తన ఆర్థిక శక్తిని వినియోగించి, పాక్​కు ఆయుధాలు సరఫరా చేయొద్దని నెదర్లాండ్స్‌పై ఒత్తిడి తీసుకురావొచ్చని తెలుస్తోంది.

    READ ALSO  US tariffs | అన్యాయం.. అసమంజసం.. అమెరికా సుంకాలను తీవ్రంగా ఖండించిన భారత్

    భారత్​ ఒక్క నెదర్లాండ్స్​తోనే 22 బిలియన్ డాలర్ల వాణిజ్య భాగస్వామ్యం కలిగి ఉంది. ఇక పాకిస్తాన్ విషయానికి వస్తే.. మొత్తం యూరప్​తో కేవలం 15 బిలియన్ డాలర్ల వ్యాపారం మాత్రమే చేస్తుండడం గమనార్హం.

    పాకిస్తాన్‌కు ఆయుధాలు సరఫరా చేయడం కొనసాగిస్తే, తుర్కియే లాంటి పరిస్థితి నెదర్లాండ్స్ కూడా ఎదరయ్యే ప్రమాదం లేకపోలేదు. అయితే చైనా, తుర్కియే మాదిరి.. నెదర్లాండ్స్‌కు పాక్​ పట్ల ఎలాంటి రాజకీయ ప్రాధాన్యం లేదు. ఇక పాకిస్తాన్ వల్ల పరిస్థితులు భారత్​తో సంబంధాలు తెంచుకునేంత విబేధాలు నెదర్లాండ్స్ కు లేవు.

    ​మూడు దేశాల నుంచి పాక్ ఆయుధాలు అందుకుంటోంది. చైనా అతిపెద్ద సరఫరాదారు, నెదర్లాండ్స్ రెండో స్థానంలో, తుర్కియే మూడో స్థానంలో ఉన్నాయి. పాక్​ ఆయుధ నిల్వల్లో 81 శాతం చైనా నుంచి, 5.5 శాతం నెదర్లాండ్స్, 3.8 శాతం ఆయుధాలు తుర్కియే నుంచి వస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇది 2020 ‌‌_ 24 వరకు ఐదేళ్ల డేటా. 2024 ఏడాది గణాంకాలు పరిశీలిస్తే.. నెదర్లాండ్స్ కంటే పాకిస్తాన్‌కు తుర్కియే ఎక్కువ ఆయుధాలు సరఫరా చేసింది. మరి భవిష్యత్తులో పాకిస్తాన్​కు నెదర్లాండ్స్ దూరంగా ఉంటోందో లేదో వేచి చూడాల్సిందే.

    READ ALSO  Earth | భూమి వేగం పెరుగుతోంది.. మ‌హా విప‌త్తు రాబోతుందా అనే టెన్ష‌న్

    Latest articles

    Mobile Charging | మొబైల్ ఛార్జింగ్ త్వరగా అయిపోతోందా.. ఈ టిప్స్ మీకోసమే..

    అక్షరటుడే, హైదరాబాద్: Mobile Charging | మొబైల్ ఫోన్.. మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగం. అయితే, బ్యాటరీ...

    To Let | టూలెట్‌.. పొగ, మద్యం తాగినా పట్టించుకోనంటూ ప్రకటన

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : To Let | బెంగళూరు (Bangalore)లో ఓ యువతి పోస్ట్ చేసిన టూలెట్ (TO...

    Navipet Mandal | రాఖీ కట్టించుకుని ఇంటికి వెళ్తూ.. రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి..

    అక్షరటుడే, బోధన్​: Navipet Mandal | అక్కతో రాఖీ కట్టించుకుని తిరిగి ఇంటికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో మృత్యువాత...

    Mallareddy | నాకు రాజకీయాలు వద్దు.. కాలేజీలు నడుపుకుంటా.. మాజీ మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Mallareddy | మాజీ మంత్రి, మేడ్చల్​ ఎమ్మెల్యే (Medchal MLA) మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు...

    More like this

    Mobile Charging | మొబైల్ ఛార్జింగ్ త్వరగా అయిపోతోందా.. ఈ టిప్స్ మీకోసమే..

    అక్షరటుడే, హైదరాబాద్: Mobile Charging | మొబైల్ ఫోన్.. మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగం. అయితే, బ్యాటరీ...

    To Let | టూలెట్‌.. పొగ, మద్యం తాగినా పట్టించుకోనంటూ ప్రకటన

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : To Let | బెంగళూరు (Bangalore)లో ఓ యువతి పోస్ట్ చేసిన టూలెట్ (TO...

    Navipet Mandal | రాఖీ కట్టించుకుని ఇంటికి వెళ్తూ.. రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి..

    అక్షరటుడే, బోధన్​: Navipet Mandal | అక్కతో రాఖీ కట్టించుకుని తిరిగి ఇంటికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో మృత్యువాత...