అక్షరటుడే, ఇందూరు: Marwadi Yuva Manch | ప్రయాణికుల దాహార్తి తీర్చేందుకు చలివేంద్రాలను ఏర్పాటు చేసినట్లు మార్వాడీ యువమంచ్ అధ్యక్షుడు సందీప్ సార్డా(Sandeep Sarda) అన్నారు. నగరంలోని రైల్వేస్టేషన్‌లోని రైల్వే ప్రొటెక్షన్ కార్యాలయం(Railway Protection Office) ఎదుట చలివేంద్రాన్ని ముఖ్య అతిథులు జుగల్ జాజు, శ్యాం జి చప్పర్యాల్ ప్రారంభించినట్లు పేర్కొన్నారు. రోజురోజుకూ భానుడు ఉగ్రరూపం చూపుతున్నాడని.. ఈ ఉద్దేశంతో ప్రయాణికుల సౌకర్యార్థం ఈ కార్యక్రమం నిర్వహించామన్నారు. ఆర్పీఎఫ్ ఐపీఎఫ్ సుబ్బారెడ్డి, మార్వాడీ యువమంచ్ ఉపాధ్యక్షుడు డాక్టర్ అంకిత్ అగర్వాల్, కార్యదర్శి కృష్ణకుమార్, సహాయ కార్యదర్శి రమేశ్ పాండే, కోశాధికారి సందీప్‌కుమార్, కార్యనిర్వహణ అధికారి కృష్ణ ఉపాధ్యాయ, ఆర్పీఎఫ్ ఎస్సై ప్రవీణ్, హరిబాబు తదితరులు పాల్గొన్నారు.
Marwadi Yuva Manch | మార్వాడీ యువ మంచ్ ఆధ్వర్యంలో చలివేంద్రం
5