fruit bats | గబ్బిలాలతో నోరూరించే చిల్లీ చికెన్​.. స్ట్రీట్​ ఫుడ్​ జాగ్రత్త సుమా..!
fruit bats | గబ్బిలాలతో నోరూరించే చిల్లీ చికెన్​.. స్ట్రీట్​ ఫుడ్​ జాగ్రత్త సుమా..!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: fruit bats : స్ట్రీట్​ ఫుడ్​ అంటే అందరికీ క్రేజీనే.. ఎక్కడబడితే అక్కడ ఎగబడి లాగించేస్తారు.. ఇదే అవకాశంగా మార్చుకున్న కొందరు అక్రమార్కులు భారీ మోసానికి తెర లేపారు. పండ్లు తినే గబ్బిలాల(ఫ్రూట్​ బ్యాట్​) మాంసాన్ని వండి చిల్లీ చికెన్ chilli chicken పేరుతో విక్రయిస్తున్నారు. ​ఒళ్లు జల్లుమనే ఈ ఘటన తమిళనాడు(TamilNadu)లో వెలుగుచూసింది.

తమిళనాడులోని సేలం జిల్లా Salem district లో ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతున్న ముఠా పట్టుబడింది. ఈ ముఠా సభ్యులు చికెన్ ముసుగులో దారుణానికి ఒడిగడుతున్నారు. ఫ్రూట్ బ్యాట్‌లను వేటాడి తీసుకొస్తున్నారు. వాటి మాంసాన్ని శుభ్రం చేసి, చిల్లీ చికెట్​ స్టైల్​లో వండుతున్నారు. అనంతరం పట్టణ వీధుల్లో చిల్లీ చికెన్‌ పేరిట ఆహార ప్రియులకు అమ్ముతున్నారు.

తిండిపై ఉన్న మోజుతో.. తాము తింటున్నదేమిటో కూడా స్పృహ లేని స్థితిలో గబ్బిలాల మాంసాన్ని చిల్లీ చికెన్​గా భావించి, ఎగబడి తినేస్తున్నారు. ఇలా ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న విషయం బయటకు పొక్కడంతో పోలీసులు దాడులు చేపట్టారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

fruit bats : తుపాకుల మోత..

నిందితులు ఒమలూర్ (Omalur) సమీపంలోని డానిష్‌పేట్టై (Danishpettai) వద్ద గబ్బిలాలను వేటాడేవారు. తోప్పూర్ రామసామి అటవీ ప్రాంతంలో తుపాకుల శబ్దం విన్న సమీప జనాలు.. అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో అటవీశాఖ అధికారులు తనిఖీలు చేపట్టగా.. విస్తుపోయే విషయాలు వెలుగుచూశాయి.

నిందితులు గబ్బిలాలను వేటాడటం, వాటితో సువాసనలు వెదజల్లేలా వంటకాలు తయారు చేయడం కనబడింది. ఆరా తీయగా.. అలా వండిన మాంసాన్ని చికెన్‌ పేరిట విక్రయిస్తున్నట్లు తేలింది. నిందితులను కమల్‌, సెల్వంగా అధికారులు గుర్తించారు. దర్యాప్తు కొనసాగుతోందని వారు పేర్కొన్నారు. దీని వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారనే కోణంలో విచారిస్తున్నారు.

fruit bats : షెడ్యూల్-2 జాతిగా రక్షణ..

భారతీయ వన్యప్రాణి సంరక్షణ చట్టం – 1972(Indian Wildlife Protection Act, 1972) లోని షెడ్యూల్-2 కింద ఫ్రూట్ బ్యాట్‌లకు రక్షణ కల్పిస్తున్నారు. ఈ చట్టంలోని నిబంధన ప్రకారం ఫ్రూట్ బ్యాట్‌లను వేటాడటం, చంపడం, విక్రయించడం నేరం. ఇలాంటి నేరాలకు పాల్పడినవారికి ఏడేళ్ల జైలుశిక్ష, రూ.3 లక్షల వరకు జరిమానా శిక్షగా విధించే అవకాశాన్ని చట్టం కల్పిస్తోంది.

2021లోనూ ఇలాంటి ఘటనే ఒకటి వెలుగుచూసింది. తుమకూరు (Tumkur) జిల్లాలో 25 ఫ్రూట్ బ్యాట్‌లను వేటాడారు. వాటిని అక్రమంగా రవాణా చేస్తూ నిందితులు పట్టుబడ్డారు. మాంసం కోసమే వాటిని తుమకూరు, బెంగళూరు(Bengaluru)కు రవాణా చేస్తున్నట్లు విచారణలో తేలింది.