అక్షరటుడే, ఇందూరు: SSR Discovery | ఎస్ఆర్ఆర్ డిస్కవరీ పాఠశాలలో (SSR Discovery School) శనివారం బాలల దినోత్సవాన్ని ఉత్సాహంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాఠశాల ఛైర్మన్ మారయ్యగౌడ్, సీఈవో హరిత గౌడ్, డైరెక్టర్ హర్షిత్ గౌడ్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా మారయ్య గౌడ్ మాట్లాడుతూ విద్యార్థులు పాఠశాల దశలో సరైన క్రమశిక్షణను అలవర్చుకొని ఉన్నత స్థానాలు చేరుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం విద్యార్థులు నృత్యాలతో ఆహుతులను అలరించారు. హార్స్ రైడింగ్, మ్యాజిక్ షో, ఫుడ్ కోర్టులు ఈ ప్రోగ్రామ్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
![]()
![]()
![]()
