అక్షరటుడే, భీమ్‌గల్: Bheemgal Mandal | చిన్నారులకు మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని ఐసీడీఎస్ సీడీపీవో స్వర్ణలత (ICDS CDPO Swarnalatha) అన్నారు. భీమ్‌గల్ మండలంలోని ముచ్కూరు గ్రామ రైతువేదికలో మంగళవారం భీమ్‌గల్, వేల్పూర్ మండలాల (Bheemgal and Velpur mandals) అంగన్వాడీ టీచర్లకు పోషణ – చదువు అనే అంశంపై శిక్షణ తరగతులు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అంగన్వాడీ కేంద్రాల్లో (Anganwadi centers) చిన్నారులకు విద్యాభ్యాసంతో పాటు పౌష్టికాహారం అందించాలన్నారు. ఇందులో భాగంగానే బాల్య ఆరంభ దశ విద్యాభివృద్ధికి మూడు నుంచి ఆరేళ్ల పిల్లలకు పౌష్టికారం, శారీరక, మానసిక ఎదుగుదలకు విద్య, ప్రీస్కూల్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ నెల 16 నుంచి 18 వరకు శిక్షణ తరగతులు కొనసాగుతాయన్నారు. కార్యక్రమంలో శిక్షకులు శారద, విజయరాణి, పర్యవేక్షకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.