అక్షరటుడే, కామారెడ్డి: Children Missing | ఓ సంస్థ సంరక్షణలో ఉన్న ఇద్దరు బాలలు మిస్ అయ్యారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా Kamareddy district పాల్వంచ మండలం Palvancha mandal భవానిపేట Bhawanipet లో చోటుచేసుకుంది.
గ్రామ శివారులో ఉన్న చైల్డ్ కేర్ సంస్థ నుంచి ఇద్దరు బాలురు అదృశ్యమయ్యారని మాచారెడ్డి ఎస్సై అనిల్ తెలిపారు. ఈ మేరకు సంస్థ ప్రతినిధులు ఫిర్యాదు చేశారన్నారు.
అక్టోబరు 1 (బుధవారం) రాత్రి 8:45 గంటలకు 12 ఏళ్ల, 13 ఏళ్ల ఇద్దరు బాలలు కనిపించకుండా పోయారని పేర్కొన్నారు. సంస్థ నుంచే అదృశ్యమైనట్లు చెప్పారు.
Children Missing | మిస్సింగ్ కేసు నమోదు
childcare సంస్థ పర్సనల్ ఇన్ఛార్జి బుక్యా శోభన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేస్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.
బాలల కోసం పోలీసు బృందాలు వెతుకుతున్నట్లు ఎస్సై తెలిపారు. పిల్లల ఆచూకీ లభిస్తే 87126 86151 నంబరుకు సమాచారం ఇవ్వాలని ఎస్సై కోరారు.