అక్షర టుడే, బాల్కొండ: Balkonda | బాల్య వివాహాల నియంత్రణకు (control child marriages) కృషి చేయాలని అధికారులు అన్నారు. ఈ మేరకు గురువారం మండలంలోని ఎంపీడీవో కార్యాలయంలో (MPDO office) బాల్య వివాహ నిరోధక చట్టంపై గ్రామస్థాయి, మండల స్థాయి కమిటీలు ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కలెక్టర్ ఆదేశాల మేరకు కమిటీలకు బాల్య వివాహాలు, నివారణ చర్యలు, శిక్షలు, బాల్యవివాహాలతో అనర్థాలపై వివరించారు. గ్రామస్థాయి కమిటీలు (village-level committees) క్షేత్రస్థాయిలోనే బాల్య వివాహాలను నిరోధించవచ్చన్నారు. వివాహ వయస్సు మహిళలకు 18 ఏళ్లు, పురుషులకు 21ఏళ్లు నిండిన తరువాతే ఉంటుందన్నారు.
అక్రమ దత్తత నివారణ కోసం అవగాహన, బాలల హక్కుల పరిరక్షణ, మానవ అక్రమ రవాణా నిరోధించడం, బేటీ బచావో బేటీ పడావో, ఉచిత నిర్బంధ విద్య హక్కు చట్టం, మాదకద్రవ్యాల నివారణ, చైల్డ్ హెల్ప్‌లైన్ 1098, తదితర అంశాలపై వివరించారు. కార్యక్రమంలో తహశీల్దార్ శ్రీనివాస్ (Tehsildar Srinivas), ఐసీడీఎస్ సూపర్వైజర్ రమాదేవి, ఎంపీడీవో, ఎంపీవో, ఎస్సై, తదితరులు పాల్గొన్నారు.
1 comment
[…] పేర్కొన్నారు. బాల్కొండ (Balkonda)లో శుక్రవారం వరిపంట క్షేత్ర […]
Comments are closed.