అక్షరటుడే, వెబ్డెస్క్:Traffic Police | ట్రాఫిక్ పోలీసుల అత్యుత్సాహంతో ఓ చిన్నారి ప్రాణం పోయింది. హెల్మెట్(Helmet) ధరించకుండా బైక్పై వెళ్తున్న వ్యక్తిని సడెన్గా ఆపడానికి పోలీసులు యత్నించారు. ఈ క్రమంలో బైక్ అదుపు పడిపోయింది. అనంతరం టెంపో ఢీకొనడంతో బైక్పై ఉన్న పాప చనిపోయింది. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రం(Karnataka State) మండ్య మండలంలో చోటు చేసుకుంది. మద్దూరు మండలం గొరవనహళ్లి గ్రామానికి చెందిన అశోక్, వాణి దంపతులు తమ కుమార్తె ప్రతీక్షను వైద్యం కోసం మండ్య జిల్లాలోని మెడికల్ కళాశాల ఆస్పత్రికి తీసుకు వెళ్లారు.
మండ్య మండల కేంద్రంలో పోలీసులు వాహనాల తనిఖీ(Vehicle Inspection) చేస్తున్నారు. అయితే అశోక్ హెల్మెట్ ధరించలేదని ట్రాఫిక్ పోలీసులు(Traffic Police) వారి బైక్ను ఆపడానికి హడావిడి చేయగా బైక్ అదుపుతప్పి రోడ్డుపై పడిపోయారు. ఈ క్రమంలో చిన్నారి ప్రతీక్షను వెనుక నుంచి వచ్చిన టెంపో ఢీకొనడంతో అక్కడిక్కడే మృతి చెందింది. పోలీసుల తీరుకు నిరసనగా చిన్నారి తల్లిదండ్రులు, స్థానికులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. పోలీసు ఉన్నతాధికారులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు ఆరా తీశారు. ఘటనకు బాధ్యులైన పోలీసులను సస్పెండ్ చేశారు.
కాగా వాహనాల తనిఖీ సమయంలో కొందరు పోలీసులు(Traffic Police) చేస్తున్న అత్యుత్సాహంతో ఎంతోమంది వాహనదారులు ఇబ్బందులు పడుతుంటారు. ఒక్కసారిగా వచ్చి వాహనాన్ని ఆపడానికి యత్నించడంతో గతంలో తెలంగాణలో సైతం చాలా మంది కింద పడి గాయపడ్డారు. గతంలో హైదరాబాద్లోని ఐడీపీఎల్(Hyderabad IPDL)లో సైతం ట్రాఫిక్ పోలీసుల వాహనాల తనిఖీ సమయంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఫైన్ల కోసం ప్రాణాలు పోయేలా వ్యవహరించడం సరికాదని ప్రజలు అంటున్నారు. ఒకవేళ వాహనదారుడు తప్పించుకుంటే ఫొటోలు తీసి ఫైన్ వేయాలని, కానీ బైక్ను సడెన్గా ఆపడం, తోయడం లాంటివి చేయొద్దని కోరుతున్నారు.