అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Harvard University | అమెరికా (America)లోని హర్వర్డ్ యూనివర్సిటీలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కోర్సు ముగిసింది. దీంతో ఆయనకు యూనివర్సిటీ ప్రతినిధులు సర్టిఫికెట్ అందజేశారు.
హార్వర్డ్‌లోని కెన్నెడి స్కూల్లో ‘21వ శాతబ్దం నాయకత్వం’ అనే అంశంపై వారం రోజుల కోర్సు నిర్వహించారు. 62 మంది ప్రపంచ నాయకులు ఈ కోర్సుకు హాజరు కాగా.. అందులో సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) సైతం ఉన్నారు. గురువారం (అమెరికన్ కాలమానం ప్రకారం) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హార్వర్డ్ కెన్నడీ స్కూల్లో ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ (Executive Education) కార్యక్రమాన్ని పూర్తి చేశారు. ప్రతిరోజూ ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు సీఎం తరగతులకు హాజరు అయ్యారు. ఆ నెల 25న ప్రారంభమైన కోర్సు వారం రోజుల పాటు సాగింది.
Harvard University | సీఎం రికార్డు
ఈ కోర్సుకు దాదాపు 20కి పైగా దేశాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. వివిధ అంశాలపై శిక్షణ పొందారు. అధికారం, నాయకత్వం, సంఘర్షణలు, అనిశ్చితి వంటి అంశాలపై కెన్నెడి స్కూల్ (Kennedy School)లో వివరించారు. అధికారంలో ఉండగా.. హార్వర్డ్ నుంచి ఈ రకమైన సర్టిఫికెట్ పొందిన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి రికార్డ్ సృష్టించారు. కాగా ఆయన ఫిబ్రవరి 1న తిరిగి హైదరాబాద్ (Hyderabad) రానున్నారు. అనంతరం మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పలు జిల్లాల్లో పర్యటించనున్నట్లు సమాచారం. దావోస్ పర్యటనకు ముందు సీఎం పలు జిల్లాల్లో పర్యటించి అభివృద్ధి పనులు ప్రారంభించారు. దావోస్ పర్యటన అనంతరం సీఎం అమెరికా వెళ్లారు. అక్కడి నుంచి వచ్చాక ఆయన పురపోరుపై ఫోకస్ చేయనున్నట్లు తెలిసింది.