అక్షరటుడే, నిజామాబాద్ క్రైం : CM Revanth Reddy | సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం జిల్లా పర్యటనకు వస్తున్నారు. ఈ సందర్భంగా నగరంలో పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య (CP Sai Chaitanya) తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. బర్ధిపూర్ గ్రామ శివారులోని కేశాపూర్ (Keshapur) రోడ్డులో సీఎం సభ జరుగనుంది.
CM Revanth Reddy | ట్రాఫిక్ సూచనలు పాటించాలి..
శుక్రవారం ఉదయం 9.00 గంటల నుంచి మధ్యాహ్నం 4.00 గంటల వరకు వాహనదారులు కింది ట్రాఫిక్ సూచనలను పాటించాలని సీపీ సాయిచైతన్య పేర్కొన్నారు. ఆర్మూర్, జక్రాన్‌పల్లి, ధర్పల్లి, సిరికొండ, ఇందల్వాయి, డిచ్పల్లి వైపు నుంచి సభకు వచ్చే వాహనాలు ఎన్‌హెచ్–44 రోడ్డు మీదుగా డిచ్పల్లి, ధర్మారం, నడిపల్లి, ఎంఎన్ఆర్ గెస్ట్ హౌస్ వద్ద యూ టర్న్ తీసుకుని, కొత్తగా నిర్మిస్తున్న నారాయణ కాలేజ్ (Narayana College) పార్కింగ్ ప్రాంతానికి చేరుకోవాలి.
CM Revanth Reddy | మాక్లూర్, నందిపేట్ వైపు నుంచి వచ్చే వాహనాలు..
దాస్‌నగర్, మాణిక్‌బండార్, అమ్రాద్, ఒడ్యాట్‌పల్లి, కేశాపూర్ మీదుగా త్రిమూర్తి కోల్డ్ స్టోరేజ్ సమీపంలోని పార్కింగ్ ప్రాంతాలకు చేరుకోవాలి.
CM Revanth Reddy | బోధన్ వైపు నుంచి వచ్చే వాహనాలు..
అర్సపల్లి జంక్షన్, అర్సపల్లి రైల్వేగేట్ (Arsapalli Railway Gate), కొత్తగా నిర్మించిన కలెక్టరేట్ ఐడీవోసీ, కంఠేశ్వర్ బైపాస్, మాధవ నగర్ బైపాస్, కేశాపూర్ కమాన్ మీదుగా సుధీర్ రెడ్డి కాలేజ్ పార్కింగ్ ప్రాంతానికి చేరుకోవాలి.
CM Revanth Reddy | వర్ని, మోస్రా, చందూర్ వైపు నుంచి వచ్చే వాహనదారులు..
వర్ని ఎక్స్‌రోడ్, ఆర్ఆర్ ఎక్స్‌రోడ్, పులాంగ్ జంక్షన్, రుక్మిణి చాంబర్, పాంగ్రా, బోర్గాం (పి) బ్రిడ్జి, మాధవనగర్ రైల్వే గేట్ (Madhavnagar Railway Gate), కేశాపూర్ కమాన్ మీదుగా సుధీర్ రెడ్డి కాలేజ్ పార్కింగ్ ప్రాంతానికి చేరుకోవాలి.
ఇతర వాహనాలు..
హైదరాబాద్ నుంచి నిజామాబాద్ (Hyderabad to Nizamabad), ఆర్మూర్, బోధన్, బాన్సువాడ వైపులకు వెళ్లే వాహనాలకు సాధారణ రహదారులలో ఎటువంటి మార్పులు ఉండవని తెలిపారు. వాహనదారులు ట్రాఫిక్ పోలీస్ (Traffic Police) సిబ్బంది సూచనలను పాటిస్తూ ట్రాఫిక్ నియంత్రణకు సహకరించాలని పోలీస్ కమిషనర్ విజ్ఞప్తి చేశారు.
1 comment
[…] రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) వికారాబాద్ జిల్లా కొడంగల్‌లో ఓటు […]
Comments are closed.