అక్షరటుడే, హైదరాబాద్: Chief Minister Revanth Reddy | గోదావరి Godavari, కృష్ణా జలాల Krishna river waters విషయంలో తాము చర్చకు సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. వచ్చే ఏడాది జనవరి 2 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. గోదావరి జలాలపై మరో రోజు, కృష్ణా జాలాలపై ఒక రోజు చర్చిద్దామన్నారు. ఆదివారం (డిసంబరు 21) భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై రేవంత్ స్పందించారు.
Chief Minister Revanth Reddy.. తెలంగాణకు ద్రోహం చేసింది కేసీఆరే..
మీడియాతో చిట్ చాట్లో మాట్లాడారు. తెలంగాణకు కేసీఆరే ద్రోహం చేశారన్నారు. కేసీఆర్ హయాంలో ఒక్క నీటిపారుదల ప్రాజెక్టు కూడా పూర్తి కాలేదన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కేసీఆర్ దెబ్బ తీశారని ఆరోపించారు. కేసీఆర్ వస్తే నీటి పారుదల ప్రాజెక్టుల వర్క్స్ చూపిస్తామన్నారు. కృష్ణా జలాల్లో 36 శాతం వాటా అంగీకరించింది అప్పటి కేసీఆర్ అని, తాము 71 శాతం వాటా కోసం పోరాడుతున్నట్లు తెలిపారు.