HomeUncategorizedPunjab CM | కేజ్రీవాల్‌కి బౌన్స‌ర్ మాదిరిగా పంజాబ్ ముఖ్య‌మంత్రి.. ఇదేం చోద్యం అంటున్న నెటిజ‌న్స్

Punjab CM | కేజ్రీవాల్‌కి బౌన్స‌ర్ మాదిరిగా పంజాబ్ ముఖ్య‌మంత్రి.. ఇదేం చోద్యం అంటున్న నెటిజ‌న్స్

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Punjab CM | పంజాబ్ ముఖ్య‌మంత్రి భగవంత్ మాన్ (Punjab CM bhagwant mann) పేరు త‌ర‌చు వార్త‌లలో నిలుస్తుంటారు. ఒక కమెడియన్‌గా, రాజకీయ నాయకుడిగా భగవంత్ మాన్‌కు ప్రజల్లో గుర్తింపు ఉంది. ఆయనకున్న ప్రత్యేక లక్షణం ఏంటంటే ఫోన్ నంబర్లన్నీ గుర్తు పెట్టుకుంటారు. వార్తాపత్రికలు, రేడియోలతో ఆయనకు ప్రత్యేక అనుబంధం ఉంది. రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లోని సమస్యలు తెలుసుకునేందుకు పొద్దున్నే లేచి జిల్లా వార్తా పత్రికలను (district newspapers) చూస్తారు. రేడియోలో క్రికెట్ కామెంటరీ వినడం ఆయన చిన్ననాటి అలవాటు. ఆ అలవాటును ఆయన ఇప్పటికీ మార్చుకోలేదు

Punjab CM | ఇదేం ప‌ద్ద‌తి..

సంగ్రూర్‌లోని సునామ్ షహీద్ ఉద్ధమ్ సింగ్ కాలేజీలో (Sunam Shaheed Udham Singh College) చదువుతున్న సమయంలో కవితలు, కామెడీ విభాగాల్లో పలు పోటీల్లో విజేతగా నిలిచారు. ప్రొఫెషనల్ కమెడియన్‌గా (professional comedian) మారారు. ఒక సమావేశంలో మన్‌ప్రీత్ బాదల్‌ను కలిసిన భగవంత్ మాన్ రాజకీయాల వైపు ఆకర్షితులయ్యారు. 2014లో ఆయన ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. ఆ సంవత్సరం జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో (Lok Sabha elections) ఆమ్ ఆద్మీ పార్టీ 4 లోక్‌సభ స్థానాలను గెలుచుకుంది. అప్పటి నుంచి ఆయనే పంజాబ్‌లో ఆమ్‌ఆద్మీ పార్టీకి కీలక నేతగా మారారు.8 మే 2017న భగవంత్ మాన్‌ను ఆమ్‌ఆద్మీ పార్టీ (Aam Aadmi Party) పంజాబ్ యూనిట్ ప్రెసిడెంట్‌గా నియమించింది. కానీ ఆయన వెంటనే రాజీనామా చేశారు. డ్రగ్స్ మాఫియాను ప్రోత్సహిస్తున్నారని ఆరోపిస్తూ అకాలీ నాయకుడు బిక్రమ్ సింగ్ మజిథియాపై ఆమ్‌ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ (Arvind Kejriwal), మరికొందరు నేతలు ఆరోపణలు చేశారు.

పదేళ్లుగా రాజకీయాల్లో ఉంటున్న భగవంత్ మాన్‌పై ఉన్న ప్రధాన ఆరోపణ …ఆయన నిత్యం మద్యం సేవించి ఉంటారని. పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ కూడా భగవంత్ మాన్ పై ఇవే ఆరోపణలు చేశారు.పార్లమెంట్‌లో ఆయన ప్రసంగాలు చేసినప్పుడు మద్యం మత్తులో ఉన్నారంటూ అధికార బీజేపీ సభ్యులు పలుమార్లు ఆరోపించారు జనవరి 1, 2019 నుంచి తాను మద్యం ముట్టబోనని తన తల్లికి ప్రమాణం చేసి చెప్పానని బర్నాలలో జరిగిన పార్టీలో భగవంత్ మాన్ వెల్లడించారు. అయితే ప్ర‌స్తుతం పంజాబ్‌కి ముఖ్య‌మంత్రిగా ఉన్న భ‌గ‌వంత్ మాన్.. కేజ్రీవాల్ రోడ్ షో(Kejriwal road show)లో బౌన్స‌ర్ మాదిరిగా ప్ర‌వ‌ర్తించాడు. కేజ్రీవాల్ కారుకి సైడ్ ఓ వైపు వేలాడుతూ విచిత్రంగా ప్ర‌వ‌ర్తించాడు. దీనిపై ప‌లువురు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. సీఎం తీరు ఇలానే ఉంటుందా అంటూ మండిప‌డుతున్నారు.