అక్షరటుడే, వెబ్‌డెస్క్: అస్సాం Assam రాష్ట్ర ప్రభుత్వం (Assam state government) సంచలన నిర్ణయం తీసుకుంది. సరిహద్దు రాష్ట్రం కాబట్టి అనేక సెన్సిటివ్ ఏరియాలు ఉన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ తాజాగా ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇతర దేశాలతో సరిహద్దు పంచుకున్న ప్రాంతాలు, వెనుకబడిన ప్రాంతాల్లో ఉండే వారికి ఆయుధాల లైసెన్సులు ఇవ్వాలని కేబినెట్ తీర్మానించింది. అర్హులైన పౌరులను గుర్తించి గవర్నమెంట్ ఆయుధాలు వాడే అనుమతి ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు.
Cm himanta biswa : సంచలన నిర్ణయం..
మారుమూల ప్రాంతాలలో అభద్రతతో కొందరు జీవనం సాగిస్తున్నారు. అందుకే వారికి ఆయుధ లైసెన్సులు ఇవ్వాలని అస్సాం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బుధవారం అస్సాం సీఎం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ముప్పు ఉన్న, మారుమూల ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజల నుండి వచ్చిన డిమాండ్‌ని సమీక్షించిన అనతరం రాష్ట్ర క్యాబినేట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నామని himanta biswa sarma తెలియజేశారు.
ఇక అస్సాం చాలా సున్నితమైన రాష్ట్రం. ఇక్కడ కొన్ని ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలు చాలా అభద్రతా భావంతో బతుకుతున్నారు. చాలా కాలంగా వారు వెపన్ లైసెన్స్ మంజూరు చేయాలని కోరుతున్నారు. అయితే రాష్ట్రంలో ముప్పు ఉన్న ప్రాంతం, మారుమూల ఏజెన్సీ కావడంతో అర్హత కలిగిన వారికి లైసెన్సులు ఇవ్వడానికి ప్రభుత్వం ఆసక్తి చూపుతుందని సీఎం అన్నారు.
కాగా.. ఈ కేటగిరిలో ధుబ్రి(Dhubri), మోరిగావ్(Morigaon), బార్ పేట(Barpeta), నాగావ్,(Nagaon) దక్షిణ సల్మారా- మాంకాచార్ (South Salmara-Mankachar) వంటి ప్రాంతాలు ఉన్నాయని సీఎం తెలియజేశారు. ఆ ప్రజలు మైనారిటీలుగా Minorities ఉన్నట్టు పేర్కొన్నారు.
